Whats Today : టీడీపీ-జనసేన జాయింట్ యాక్షన్ కమిటీ భేటీ.. ఇంద్రకీలాద్రిపై రెండు రూపాల్లో దుర్గమ్మ దర్శనం

Whats Today : ఇవాళ  మధ్యాహ్నం రాజమండ్రిలోని హోటల్ మంజీరాలో టీడీపీ-జనసేన జాయింట్ యాక్షన్ కమిటీ తొలి భేటీ జరగనుంది.

  • Written By:
  • Updated On - October 23, 2023 / 08:10 AM IST

Whats Today : ఇవాళ  మధ్యాహ్నం రాజమండ్రిలోని హోటల్ మంజీరాలో టీడీపీ-జనసేన జాయింట్ యాక్షన్ కమిటీ తొలి భేటీ జరగనుంది. నారా లోకేష్, పవన్ కళ్యాణ్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటం, ఉద్యమ కార్యాచరణ, తాజా రాజకీయ పరిణామాలు, ఇరు పార్టీల సమన్వయంపై ఈసందర్భంగా చర్చించనున్నారు.

  • జగనాసుర దహనం పేరిట ఇవాళ  నిరసనలు నిర్వహించాలని నారా లోకేష్‌ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
  • నేడు చంద్రబాబుతో కుటుంబ సభ్యులు ములాఖత్ కానున్నారు. బాబుతో నారా లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మిణి ములాఖత్ అవుతారు.
  • హమూన్ తుఫాను ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకొని ఉన్న ప్రాంతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది వాయవ్య దిశగా పయనిస్తూ పశ్చి­మ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుంది. అనంతరం ఇది ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్‌ తీరాల వైపు పయనించనుంది.

We’re now on WhatsApp. Click to Join. 

  • ఇవాళ శ్రీశైలంలో 9వ రోజు దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు జరగనున్నాయి. సిద్ధిదాయిని అలంకారంలో శ్రీభ్రమరాంబికాదేవి దర్శనమివ్వనున్నారు. ప్రభుత్వం తరఫున మంత్రి గుమ్మనూర్ జయరామ్, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు.
  • దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో చివరి రోజైన సోమవారం.. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ రెండు రూపాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉదయం మహిషాసురమర్దనిగా.. మధ్యాహ్నం నుంచి రాజరాజేశ్వరీదేవి రూపంలో దర్శనమివ్వనున్నారు. అనంతరం కృష్ణా నదిలో దుర్గామల్లేశ్వరుల తెప్పోత్సవాన్ని ఘనంగా(Whats Today) నిర్వహించనున్నారు.

Also Read: Dussehra 2023 : దసరా వేళ.. శుభముహూర్తం, అమృతకాలం, వర్జ్యం వివరాలివీ