Chandrababu : చంద్రబాబు నివాసంలో ఎన్డీయే నేతల సమావేశం

  • Written By:
  • Publish Date - April 12, 2024 / 02:50 PM IST

Chandrababu: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో(AP elections)ఎన్డీయే (NDA) కూటమి విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. కూటమిలోని అన్ని పార్టీలు కలిసికట్టుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. తాజాగా అమరావతి(Amaravati)లోని చంద్రబాబు నివాసం(Chandrababu residence)లో కీలక సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి జనసేనాని(Janasena) పవన్ కల్యాణ్(Pawan Kalyan), బీజేపీ(bjp) ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి(Purandeshwari) హాజరయ్యారు. బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సిద్ధార్థ్ నాథ్ సింగ్(Siddharth Nath Singh) కూడా భేటీ అయ్యారు. ఎన్నికల వ్యూహరచన, ఉమ్మడి మేనిఫెస్టో, రాష్ట్ర ప్రచారానికి జాతీయ నేతలను ఆహ్వానించడం తదితర అంశాలపై వీరు చర్చిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సీట్లలో అభ్యర్థుల మార్పుపై వీరు చర్చించే అవకాశం ఉంది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో బీజేపీకి బదులుగా టీడీపీ పోటీ చేయడం, దీనికి బదులుగా చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం నుంచి బీజేపీకి అవకాశం ఇవ్వడం వంటి అంశాలపై నేతలు చర్చించనున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తమిళనాడులోని కోయంబత్తూరు ఎన్నికల పర్యటన ముగించుకుని నారా లోకేష్ ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకోనున్నారు. ఈ భేటీలో సీట్ల సర్దుబాటు, మూడు పార్టీల ఉమ్మడి ప్రచారంపై ప్రధానంగా చర్చించనున్నారు. ప్రధానంగా అనపర్తి, తంబళ్లపల్లి, కడప, జమ్మలమడుగు సీట్ల సర్దుబాటుపై చర్చించనున్నట్లు సమాచారం.

Read Also:BRS MP Candidate Rajaiah: వరంగ‌ల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్య‌ర్థిగా తాటికొండ రాజ‌య్య‌..!

మరోవైపు ఏపీలో ప్రస్తుతం ఉండి నియోజకవర్గంపై ఎక్కువ చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఈ స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు పేరును టీడీపీ ప్రకటించింది. అయితే, ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఈ స్థానాన్ని కేటాయిస్తున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఇటీవల రఘురాజు ఆ పార్టీలో చేరడం… ఉండి నియోజకవర్గం పరిధిలో ఆయన పార్టీ ప్రచార కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగిపోయాయి.

Read Also: Nara Lokesh Phone Tapping: ఏపీలో ట్యాపింగ్ ప్ర‌కంప‌నలు.. నారా లోకేశ్‌ ఫోన్ ట్యాపింగ్..!

ఈ నేపథ్యంలో రామరాజు అనుచరుల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో కాసేపటి క్రితం ఉండి నియోజకవర్గంపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. చంద్రబాబు పిలుపు మేరకు రామరాజు కూడా ఆయనను కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

Read Also: Actor Hospitalised: ఆసుప‌త్రిలో ప్ర‌ముఖ న‌టుడు.. ఆరోగ్య ప‌రిస్థితి ఎలా ఉందంటే..?

రఘురామకృష్ణరాజు ముఖ్యమంత్రి జగన్ బాధితుడని చంద్రబాబు అన్నారు. రఘురాజుకు న్యాయం చేయాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. ప్రజలు కూడా రఘురాజుకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారని చెప్పారు. రామరాజు ఎంతో కష్టపడి పని చేశారని… ఆయనపై ఎలాంటి వివక్ష లేదని తెలిపారు. రఘురాజు, రామరాజు ఇద్దరికీ న్యాయం చేయాలని చెప్పారు. పార్టీని నమ్ముకున్న వారికి మంచి చేయాలనేదే తన ఆకాంక్ష అని అన్నారు. బీజేపీని కూడా కలుపుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు.