Site icon HashtagU Telugu

AndhraPradesh: ఏపీలో దారుణం.. వ్యక్తిని గొడ్డలితో ముక్కలు ముక్కలుగా నరికి హత్య

Crime

Crime

ఆంధ్రప్రదేశ్ (AndhraPradesh) లోని పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది. పల్నాడు జిల్లాలో వ్యక్తిని గొడ్డలితో ముక్కలు ముక్కలుగా నరికి హత్య చేసి శవాన్ని పూర్తిగా దగ్ధం చేసిన ఘటన దాచేపల్లిలో జరిగింది. మృతుడు కోటేశ్వరరావు దాచేపల్లి నగర పంచాయితీలో పంప్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్నారు. వివాహేత సంబంధ నేపథ్యంలోనే హత్య జరిగినట్లుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. నిందితుడూ అదే నగర పంచాయితీలో పంప్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడని దాచేపల్లి పోలీసులు తెలిపారు.

దాచేపల్లిలో కోటేశ్వరరావుని దుండగులు గొడ్డలితో ముక్కలుగా నరికి దారుణంగా హత్యచేశారు. హత్య అనంతరం శరీర భాగాలను తగలబెట్టారు. దాచేపల్లి మోడల్ స్కూల్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణంగా అనుమానిస్తున్నారు.

Also Read: Pakistani Girl Love Story: ఆన్‌లైన్‌లో ప్రేమ.. భారత్‌కు వచ్చేసిన పాక్‌ యువతి

కాపురానికి వెళ్లటం లేదని

మరోవైపు తన కుటుంబం పరువును తీసిందని నంద్యాల జిల్లా ఆలమూరు గ్రామానికి చెందిన దేవేంద్ర రెడ్డి అనే వ్యక్తి తన పెద్ద కుమార్తె (21) ప్రసన్నను గొంతు నులిమి చంపేశాడు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌తో వివాహం జరిపించగా.. ప్రసన్న వెళ్లట్లేదు. కోపం పెంచుకున్న దేవేంద్రరెడ్డి కూతురుని గొంతునులిమి చంపేసి తల, మొండెం వేరు చేసి నంద్యాల-గిద్దలూరు మార్గంలో పడేశాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.