Kia Car Engines: శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని కియా పరిశ్రమలో 900 కార్ల ఇంజిన్లు మాయం అయ్యాయి. దీంతో అవి ఏమయ్యాయి ? ఎవరు చోరీ చేశారు ? అనే దానిపై చర్చ జరుగుతోంది. ఈ అంశంపై కియా యాజమాన్యం మార్చి 19న పోలీసులకు కంప్లయింట్ ఇచ్చారని తెలిసింది. తొలుత ఫిర్యాదు లేకుండానే దర్యాప్తు చేయాలని కియా యాజమాన్యం కోరగా, అందుకు పోలీసులు నో చెప్పారు. ఫిర్యాదు ఇస్తేనే దర్యాప్తు చేస్తామని తేల్చి చెప్పారు. దీంతో కియా ప్రతినిధులు పోలీసులకు కంప్లయింట్ ఇచ్చారు. దీనిపై దర్యాప్తు కోసం పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేశారు.
Also Read :HCL Tech Jobs: ఇంటర్ పాసైతే చాలు.. భారీ శాలరీతో హెచ్‌సీఎల్ టెక్‌లో జాబ్
తమిళనాడు నుంచి తీసుకొస్తుండగా..
పెనుకొండలోని కియా(Kia Car Engines) పరిశ్రమకు విడి భాగాలు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటాయి. కారు ఇంజిన్లు తమిళనాడు నుంచి సప్లై అవుతాయి. తమిళనాడు నుంచి పెనుకొండకు కార్ల ఇంజిన్లు వస్తుండగా, మార్గం మధ్యలోనే అవి చోరీ అయ్యాయా ? లేదంటే కియా పరిశ్రమలోకి వచ్చాక గాయబ్ అయ్యాయా ? అనేది పోలీసుల విచారణలో తెలియనుంది. కేసు విచారణ ప్రక్రియ కొలిక్కి వచ్చిందని సమాచారం. ఈ చోరీకి సంబంధించిన అన్ని వివరాలను త్వరలోనే పోలీసులు వెల్లడిస్తారని తెలిసింది.
Also Read :Pawan Kalyans Son: పవన్ కల్యాణ్ కుమారుడికి గాయాలు.. సింగపూర్‌లో అగ్ని ప్రమాదం
అమ్మకాల్లో కియా కారెన్స్ జోరు
కియా కారెన్స్ (Kia Carens) కారు అమ్మకాల్లో దూసుకుపోతోంది. 36 నెలల్లో 2 లక్షల కార్లు సేల్ అయ్యాయి. 70కిపైగా విదేశాల్లో 24,064 కారెన్స్ కార్లు సేల్ అయ్యాయి. సేల్ జరిగిన కియా కారెన్స్ కార్లలో 58 శాతం పెట్రోల్ వేరియంట్‌లు, 42 శాతం డీజిల్ వేరియంట్లు ఉన్నాయి. 32 శాతం మంది కియా కారెన్స్ కొనుగోలుదారులు ఆటోమేటిక్, iMT ట్రాన్స్‌మిషన్ వర్షన్లను ఎంచుకుంటున్నారు. 28 శాతం మంది కస్టమర్లు సన్‌రూఫ్‌తో కూడిన వేరియంట్లను కొనుగోలు చేస్తున్నారు. కియా కారెన్స్ ధర రూ. 12.92 లక్షల నుంచి రూ. 19.95 లక్షల మధ్య ఉంది.