Kodali Nani : గుడివాడలో కొడాలికి భారీ షాక్..

గుడివాడ వైసీపీలో కీలక నేతగా పేరున్న మైనారిటీ నేత షేక్ మౌలాలి.. టీడీపీలో జాయిన్ అయ్యారు

Published By: HashtagU Telugu Desk
Kodali Nani

Kodali Nani

ఏపీ(AP)లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార పార్టీ వైసీపీ (YCP) కి వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కీలక నేతలంతా వరుస పెట్టి రాజీనామా చేస్తూ..టీడీపీ , జనసేన , కాంగ్రెస్ లలో చేరుతున్నారు. ఇప్పటికే ఎంపీలు , ఎమ్మెల్యేలు , మాజీ ఎమ్మెల్యేలు , జడ్పీటీసీ లు ఇలా ఫై స్థాయి నేతల దగ్గరి నుండి కింద స్థాయి నేతల వరకు వరుసగా రాజీనామా చేస్తూ వస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా గుడివాడ లో ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani)కి భారీ షాక్ తగిలింది. గుడివాడ వైసీపీలో కీలక నేతగా పేరున్న మైనారిటీ నేత షేక్ మౌలాలి (Shaik Moulali).. టీడీపీలో జాయిన్ అయ్యారు. గుడివాడ టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము సమక్షంలో నేడు పార్టీ కండువా కప్పుకున్నారు. మౌలాలితో పాటు ఆయన అనుచరులు పెద్ద ఎత్తున టీడీపీలో చేరారు.

ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ… ప్రజలకు మంచి చేసేందుకు వైసీపీని వదిలి మౌలాలి లాంటి వ్యక్తులు టీడీపీలోకి వస్తున్నారన్నారు. నాని పచ్చి మోసగాడని…. అవసరం తీరిన తర్వాత వదిలేస్తాడని వైసీపీ నేతలే బహిరంగంగా చెబుతుంటారు. ప్రజలను మోసగిస్తే ఎమ్మెల్యే ఆడుతున్న డ్రామాలు ఎక్కువ రోజులు సాగవన్నారు. ప్రజలకు అబద్ధాలు చెప్పడంలో జగన్ మొదటి స్థానంలో ఉంటే, కొడాలి నాని రెండో స్థానంలో ఉన్నారని విమర్శించారు. అభివృద్ధి గురించి పట్టించుకోకుండా, అరాచకానికే ప్రాధాన్యతనిస్తున్న వైసీపీ గంజాయి మొక్కలను పీకడంలో ప్రతి పౌరుడు భాగస్వామ్యుడు కావాలని పిలుపునిచ్చారు.

Read Also : CBI case against Megha : ‘మేఘా’ ఫై సీబీఐ కేసు నమోదు..

  Last Updated: 13 Apr 2024, 10:39 PM IST