Site icon HashtagU Telugu

Dimand : కర్నూల్ జిల్లా రైతుకు దొరికిన వజ్రం.. ఎంతకు అమ్మాడో తెలుసా?

Farmer Finds Diamond

Farmer Finds Diamond

కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని తుగ్గలి మండలం(Tuggali Mandal)లో తొలకరి వర్షాలు (Monsoon ) కురవడంతో ఓ రైతు జీవితాన్ని మార్చేసే సంఘటన చోటు చేసుకుంది. తన వ్యవసాయ పొలంలో పని చేస్తుండగా ఓ విలువైన వజ్రం దొరికింది. తక్కువ సమయంలోనే ఆ వజ్రాన్ని స్థానిక వ్యాపారికి రూ.1.5 లక్షలకు విక్రయించినట్లు సమాచారం. కానీ దీని విలువ దాదాపు రూ. 2 కోట్ల వరకు ఉంటుందని అంటున్నారు. ఈ వార్త గ్రామాల్లో వేగంగా విస్తరించడంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు పెద్దఎత్తున వజ్రాల కోసం పొలాల్లో తవ్వకాలు ప్రారంభించారు.

CM Chandrababu: మహిళల వ్యక్తిత్వంపై దాడిని ఉపేక్షించేది లేదు: సీఎం చంద్రబాబు

తుగ్గలి మండలంలోని జొన్నగిరి, పరిసర గ్రామాల్లో గతంలోనూ వజ్రాలు దొరికిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇదే నేపథ్యంలో తాజా సంఘటన స్థానిక ప్రజలలో ఆశలు నింపింది. వర్షంతో నేల తడిగా మారిన సందర్భంలో, అసాధారణంగా మెరుస్తున్న రాళ్లను గుర్తించే అవకాశముంటుందని భావించిన వారు తమ కుటుంబాలతో కలిసి పొలాల్లో గాలిస్తున్నారు. తల్లిదండ్రులు చిన్నారులతో సహా పొలాల్లోనే గడుపుతూ ఆహారం, ఇతర అవసరమైన వస్తువులను తీసుకొచ్చి సాయంకాలం వరకు వేట కొనసాగిస్తున్నారు.

Knee Pain: మోకాళ్ల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారా? అయితే ఈ ప్ర‌మాద‌క‌ర వ్యాధులు ఉన్న‌ట్లే!

వజ్రాల కోసం గ్రామస్థుల ఈ ఉత్సాహం పట్ల నిపుణులు స్పందిస్తున్నారు. వారు చెబుతున్నదాని ప్రకారం.. ఈ ప్రాంతంలో వజ్రాలు దొరికే అవకాశాలు ఉన్నప్పటికీ అవి చాలా అరుదుగా లభిస్తాయి. అయినప్పటికీ, వర్షాలు పంటలకు మాత్రమే కాదు, అదృష్టానికి కూడా మార్గం కావచ్చన్న ఆశతో ప్రజలు పలు పొలాల్లో గాలింపుకు దిగుతుంటారు.