Site icon HashtagU Telugu

CBN: రూటుమార్చిన చంద్రబాబు.. గతంలో కంటే భిన్నమైన పాలన

Cbn

Cbn

CBN: గ‌తంలో మూడుసార్లు ముఖ్యమంత్రిగా ప‌నిచేసినా చంద్ర‌బాబు.. ఈసారి మాత్రం త‌న పంథాను మార్చి స‌రికొత్త నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. ముఖ్య‌మైన నిర్ణ‌యాల‌ను కేవ‌లం కేబినెట్ మీటింగ్ లోనే చ‌ర్చించేవారు. కానీ ఈసారి మాత్రం ప్ర‌జ‌ల‌ను, అధికారుల‌ను భాగస్వామ్యులుగా చేస్తూ అన్యూహ నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. తద్వారా తాము కూడా రాష్ట్ర నిర్మాణంలో భాగస్వాములం అనే అభిప్రాయం ప్ర‌జ‌ల్లో ఏర్పడుతుంది. రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలి అనే బ‌ల‌మైన ఆలోచ‌న అటు ప్ర‌జ‌ల్లో, ఇటు అధికారుల్లో నాటుకుపోయేలా చేస్తున్నారు.

ఇక చంద్ర‌బాబు రివ్యూలు, నిర్ణయాలు, సమయ పాలన, అపాయింట్మెంట్ల భారీ మార్పులు చేస్తూ కొన్ని క‌ఠిన నిర్ణ‌యాల‌తో పాటు తెలివైన నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. గ‌తంలో మాదిరిగా అపాయింట్లు మెంట్లు తీసుకున్న‌వారిని గంట‌ల త‌ర‌బ‌డి వెయిట్ చేయ‌కుండా వెంట‌నే అపాయింట్ మెంట్ ఇస్తున్నారు. ఇక సుదీర్ఘ ప్ర‌వ‌ర్ ప్ర‌జెంటేష‌న్ కార్య‌క్ర‌మాల‌కు కూడా గుడ్ బై చెప్పారు. టైమ్ మేనేజ్ మెంట్ కు పెద్ద పీట వేసే చంద్ర‌బాబు.. తాను స‌మ‌య‌పాల‌న పాటిస్తూనే.. స‌చివాల‌య ఉద్యోగుల‌ను పాటించేలా ఆదేశాలు ఇచ్చారు. ప్ర‌తి ఒక్క‌రూ స‌మ‌యానికి స‌చివాల‌యానికి రావాల్సిందేన‌ని తేల్చి మ‌రి చెప్ప‌డం చంద్ర‌బాబుకే చెల్లింది.