4232 Railway Jobs : తెలుగు రాష్ట్రాల యువతకు బంపర్ అవకాశం. ఎందుకంటే దక్షిణ మధ్య రైల్వేలో 4,232 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్‌కు ఎంపికయ్యే వారు తెలుగు రాష్ట్రాల్లోని సౌత్ సెంట్రల్ రైల్వే యూనిట్స్‌లో పనిచేయాలి. ఈ లిస్టులో సికింద్రాబాద్, కాజీపేట, హైదరాబాద్, లాలాగూడ, మెట్టుగూడ, విజయవాడ, బిట్రగుంట, గూడూరు జంక్షన్, పూర్ణ జంక్షన్, ముద్‌ఖేడ్, కాకినాడ పోర్టు, కొండపల్లి, ఒంగోలు, రాజమండ్రి, రాయనపాడు, నల్లపాడు, గుంటూరు, మచిలీపట్నం, నర్సాపూర్, గుంతకల్, తిమ్మనచర్ల, యాద్‌గిర్, నాందేడ్ ఉన్నాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి వచ్చే జిల్లాల్లో నివసించే అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకునేందుకు అర్హులు. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 50% మార్కులతో 10వ తరగతి పాసై ఉండాలి. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
Also Read :Golden Globes 2025 : గోల్డెన్ గ్లోబ్ పురస్కారాల్లో పాయల్ కపాడియాకు నిరాశ.. ‘ఆల్ వీ ఇమేజిన్ యాజ్ లైట్’ వెనుకంజ
నో రాత పరీక్ష
ఈ పోస్టుల భర్తీకి రాత పరీక్ష ఉండదు. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అయితే క్యాండిడేట్స్‌కు సంబంధించిన డాక్యుమెంట్లను వేరిఫై చేస్తారు. టెన్త్ క్లాస్ మార్కుల మెమో, ఆధార్ కార్డు, ఐటీఐ డిప్లొమా సర్టిఫికెట్, పాస్‌పోర్ట్ సైజు ఫొటోలను అభ్యర్థులు సమర్పించాలి. వెరిఫికేషన్ ప్రక్రియలో అర్హత సాధిస్తే.. తదుపరిగా మెడికల్ టెస్ట్ చేస్తారు. 2024 సంవత్సరం డిసెంబరు 28 నాటికి 15 నుంచి 24 సంవత్సరాలలోపు వయసు ఉన్నవారు ఈ జాబ్స్‌కు అప్లై చేయొచ్చు. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ జనవరి 27. అప్రెంటిస్‌షిప్‌కు ఎంపికయ్యే వారికి నెలకు రూ. 7,700 నుంచి రూ. 20,200 దాకా శాలరీ(4232 Railway Jobs) ఇస్తారు.
ఖాళీ పోస్టుల వివరాలివీ..
అత్యధికంగా ఫిట్టర్ పోస్టులు 1742, ఎలక్ట్రీషియన్ పోస్టులు 1053, వెల్డర్ పోస్టులు 713 ఉన్నాయి. డీజిల్ మెకానిక్ పోస్టులు 142, ఏసీ మెకానిక్ పోస్టులు 143, మెషినిస్ట్ పోస్టులు 100 ఉన్నాయి. ఎలక్ట్రానిక్ మెకానిక్ పోస్టులు 85, పెయింటర్ పోస్టులు 74, కార్పెంటర్ పోస్టులు 42, పవర్ మెయింటెనెన్స్ (ఎలక్ట్రీషియన్) పోస్టులు 34, ట్రైన్ లైటింగ్ (ఎలక్ట్రీషియన్) పోస్టులు 34, ఎయిర్ కండిషనింగ్ పోస్టులు 32, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ పోస్టులు 10, ఎలక్ట్రికల్ (ఎస్&టి) (ఎలక్ట్రీషియన్) పోస్టులు 10, మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ (ఎంఎంటీఎం) పోస్టులు 10, మోటార్ మెకానిక్ వెహికల్ (ఎంఎంవీ) పోస్టులు 08 ఉన్నాయి. అభ్యర్థులు రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ https://onlineregister.org.in/instructions.php అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులను సమర్పించొచ్చు. దరఖాస్తు ఫీజు 100 రూపాయలు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.