ఏపి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి(Minister Buggana Rajendranath Reddy)పై కేసు నమోదైంది( case registered). సోమవారం ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థి పీఎన్ బాబు కారుపై బుగ్గన అనుచరులు దాడికి పాల్పడ్డారు. తనను కులం పేరుతో దూషించి ఇనుపరాడ్డులతో కారు అద్దాలను పగులగొట్టారని పీఎన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బుగ్గనతో పాటు నగర పంచాయతీ ఛైర్మన్ చలంరెడ్డి, నాయకులు నాగరాజు, నాగేశ్వరరావు, మరో 30 మంది బుగ్గన అనుచరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ మేరకు బేతంచర్ల హెడ్‌కానిస్టేబుల్ మాషుం బాషా తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, వైఎస్‌ఆర్ జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డిపైనా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. పోలింగ్ సందర్భంగా చాపాడు మండలం చిన్నగులవలూరులో ఇద్దరు టీడీపీ ఏజెంట్లపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన వారిద్దరూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే సహా 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
