AP : హిందూపురంలో వైసీపీ నేత దారుణ హత్య..!!

ఏపీలో అధికారపార్టీ నేత హత్య కలకలం రేపింది. కళ్లలో కారంపొడి చల్లి, వేటకొడవళ్లతో నరికి చంపారు దుండగులు.

Published By: HashtagU Telugu Desk
Ycr Leader

Ycr Leader

ఏపీలో అధికారపార్టీ నేత హత్య కలకలం రేపింది. కళ్లలో కారంపొడి చల్లి, వేటకొడవళ్లతో నరికి చంపారు దుండగులు. ఈ దారుణం వెనక హిందూపురం, వైసీపీ నాయకులు,స్ధానిక పోలీసులు హస్తం ఉందని మృతుడి తల్లి ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాల ప్రకారం…హిందూపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా గతంలో రామకృష్ణారెడ్డి(46) పనిచేశారు. స్థానిక ఎమ్మెల్సీ ఇక్బాల్ వర్గీయులతో విబేదాలు రావడంతో పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఈ విబేధాలే అతని హత్యకు కారణమంటూ కుటుంబం ఆరోపిస్తోంది.

ఆయన స్వగ్రామం చౌళూరుకు సమీపంలో రామకృష్ణారెడ్డి ఓ దాబాను నిర్వహిస్తున్నాడు. రోజులాగే శనివారం కూడా దాబాకు వెళ్లాడు. రాత్రి వరకే అక్కడే ఉన్నారు. రాత్రి 9గంటల సమయంలో కారులో ఇంటికి బయలుదేరాడు. ఇంటి సమీపంలోనే ఉన్న దుండగులు కారు దిగగానే ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. రెండు బైకులపై ముఖాలకు మాస్కులు ధరించి వచ్చిన దుండుగులు రామకృష్ణారెడ్డి కళ్లలో కారం చల్లి కత్తులో పొడిచారు. ఆయన అక్కడే కుప్పకూలిపోయాడు. తీవ్రంగా గాయపడిన రామకృష్ణారెడ్డి మరణించాడని భావించిన దుండగులు పరారయ్యారు. ప్రాణాలతో ఉండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గ మధ్యలో ప్రాణాలు విడిచాడు. అతడి శరీరంపై 18 కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు.

రామకృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మనవడు. రాజకీయ నేపథ్యం ఉంది. హిందూపురం వైసీపీలో కీలక నేత.

  Last Updated: 09 Oct 2022, 08:40 AM IST