నేను బతికే ఉన్నా.. నా భూమి నాకు ఇప్పించండి!

అతనో రైతు, వయస్సు 55. ఉన్న ఊళ్లో  ఎలాంటి ఆదాయ మార్గాలు లేకపోవడంతో పొట్టచేత పట్టుకొని వేరే ఊరికి వెళ్లాడు. అదే అతనికి శాపమైంది. కొన్నాళ్లకు తిరిగివచ్చేసరికి అతని పేరు ఉన్న అరఎకరం  భూమి వేరొకరి పేరు మీదు రిజిష్ట్రేషన్ అయ్యింది.

  • Written By:
  • Publish Date - October 7, 2021 / 05:00 PM IST

అతనో రైతు, వయస్సు 55. ఉన్న ఊళ్లో  ఎలాంటి ఆదాయ మార్గాలు లేకపోవడంతో పొట్టచేత పట్టుకొని వేరే ఊరికి వెళ్లాడు. అదే అతనికి శాపమైంది. కొన్నాళ్లకు తిరిగివచ్చేసరికి అతని పేరు ఉన్న అరఎకరం  భూమి వేరొకరి పేరు మీదు రిజిష్ట్రేషన్ అయ్యింది. దీంతో ఏం చేయాలో తోచక రెవెన్యూ కార్యాయాల చుట్టూ తిరుగుతున్నాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది.

ఏపీలోని నెల్లురు జిల్లా మర్రిపాడు మండలంలోని పెగళ్లపాడు గ్రామానికి చెందిన షేక్ కమల్ సాహెబ్ వ్యవసాయం చేసుకుంటూ బతికేవాడు. ఈయన కు అర ఎకర పొలం ఉంది. నష్టాలు ఎన్నొచ్చినా.. వ్యవసాయం చేసుకుంటూ బతికివాడు. ఆర్థిక పరిస్థితికి మించి పెట్టుబడులు పెట్టడంతో ఎంతో నష్టపోయాడు. ఉన్న ఊళ్లో పని లేదు. వ్యవసాయం చేస్తే నష్టాలే. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఉపాధి కోసం వేరే ఊరికెళ్లాడు. అక్కడ కొన్నాళ్లు చిన్నాచితక పనులు చేసి రోజువారి జీవితం గడిపాడు. అయితే ఉన్న ఒక్కానొక కొడుకు మరణించడంతో సొంతూరికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే కమల్ సాహెబ్ తమ్ముడు ఉన్న అర ఎకరంపై కన్నేశాడు. ‘తన అన్న కమల్ సాహెబ్ చనిపోయాడు’ అంటూ తప్పుడు పత్రాలు సమర్పించి భూమి తన పేరు మీదుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు.

కమల్ సాహెబ్ సొంతూరికి రావడంతో అసలు విషయం తెలిసింది. వెంటనే రెవెన్యూ అధికారులకు జరిగిన విషయం చెప్పాడు. భూమి తన పేరు మీదుగా రిజిస్ట్రేషన్ చేయించాలని వేడుకున్నాడు. అయితే కమల్ సాహెబ్ చనిపోయాడని రికార్డుల్లో ఎక్కి ఎక్కడంతో సాధ్యపడలేదు. తాను బతికే ఉన్నట్లు అధార్ కార్డు, ఇతర గుర్తింపు కార్డులు అధికారులకు సమర్పించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. రెండేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా కహల్ సాహెబ్ కు న్యాయం జరగలేదు. ఉన్నతాధికారులే స్పందించి తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు.