Visakhapatnam : ఇంస్టాగ్రామ్‌లో పరిచయం.. 40 ఏళ్ల ఆంటీని పెళ్లి చేసుకున్న 25 ఏళ్ల యువకుడు..తర్వాత ఏమైందో తెలుసా..?

పద్మకు ఇంస్టాగ్రామ్‌లో శ్రీకాళహస్తికి చెందిన సురేష్(25)తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పద్మ, సురేష్ కోసం శ్రీకాళహస్తికి వెళ్ళింది. కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసి పద్మను తిరిగి ఇంటికి తీసుకురాగా.. 9 నెలల క్రితం మళ్ళీ వెళ్ళి సురేష్‌ను పెళ్లి చేసుకుంది.

Published By: HashtagU Telugu Desk
A 25-year-old man married a 40-year-old aunt..do you know what happened next..?

A 25-year-old man married a 40-year-old aunt..do you know what happened next..?

Visakhapatnam: టిపిన్ వెస్ట్ చేస్తుందని యువకుడు మందలించడంతో ఉరేసుకొని ఆంటీ ఆత్మహత్య చేసుకుంది. దీంతొ భయపడి విషం తాగి యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. ఇక వివరాలోకి వెళ్లితే..విశాఖపట్నానికి చెందిన పద్మ(40) అనే వివాహితకు ఒక భర్త, మెడికల్ రెప్రజెంటేటివ్ గా పని చేసే ఒక కొడుకు, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఒక కూతురు ఉన్నారు. పద్మకు ఇంస్టాగ్రామ్‌లో శ్రీకాళహస్తికి చెందిన సురేష్(25)తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పద్మ, సురేష్ కోసం శ్రీకాళహస్తికి వెళ్ళింది. కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసి పద్మను తిరిగి ఇంటికి తీసుకురాగా.. 9 నెలల క్రితం మళ్ళీ వెళ్ళి సురేష్‌ను పెళ్లి చేసుకుంది. పెళ్లయ్యాక ఇద్దరు కైలాసగిరి కాలనీలో వేరే కాపురం పెట్టారు.

పెళ్లైన దగ్గర నుండి ఇద్దరు మధ్యలో గొడవలు రాగా.. టిఫిన్, భోజనం వెస్ట్ చేస్తున్నవంటూ సురేష్, పద్మను మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన పద్మ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.. ఉరేసుకున్న పద్మను కిందికి దించిన సురేష్ భయపడి ఎవరికి చెప్పకుండా అలానే ఇంట్లోనే ఉన్నాడు. చివరికి సురేష్ పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు.. ఇంట్లో నుండి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కోన ఊపిరితో ఉన్న సురేష్‌ను పోలీసులు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ కన్నుమూశాడు.

Read Also: PM Modi : లోకోమోటివ్ ఉత్ప‌త్తి ప్లాంట్‌ను ప్రారంభించిన ప్ర‌ధాని మోడీ

  Last Updated: 26 May 2025, 02:09 PM IST