Site icon HashtagU Telugu

TDP : ఎవరెస్టుపై టీడీపీ జెండా…చంద్రబాబు ఏమన్నారో తెలుసా?

CBN Trend

CBN

వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఎందుకంటే ఈ సారి టీడీపీ గెలవకుంటే..పార్టీ మనుగడ ప్రశ్నార్థంగా మారే అవకాశం ఉంది. నియోజకవర్గాలపై నిత్యం ఫోకస్ పెడుతున్నారు చంద్రబాబు. ఎప్పటికప్పుడు పరిస్థితులను ఆరా తీస్తున్నారు. అధినేత ఒక్కరే కాదు..నాయకులు, కార్యకర్తలు సైతం కసితో ఉన్నారు. పార్టీ కోసం ఏదైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం అంటున్నారు. అధికాపార్టీ స్థానిక నేతల నుంచి ఒత్తిడి ఉన్నా తట్టుకుని నిలబడుతున్నారు కొందరు. అందుకే పార్టీకూడా కార్యకర్తలే తమ బలం అంటోంది. తమ కార్యకర్తలే ఈ సారి పార్టీని అధికారంలోకి తీసుకువస్తారన్న ధీమాతో ఉన్నారు అధినేత. తాజాగా ఓ సంఘటన ఇదే నిరూపిస్తోంది.

80ఏళ్ల వ్యక్తి 5వేల మీటర్ల ఎత్తున్న ఎవరెస్టు శిఖరంపైన టీడీపీ జెండాను ఎగురవేశారు. అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 80ఏళ్ల గింజుపల్లి శివప్రసాద్ అనే వ్యక్తి ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. అక్కడ నుంచి చంద్రబాబు గెలుపు అవసరాన్ని వివరించాడు. శివప్రసాద్ టీడీపీ జెండాతో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడంపై చంద్రబాబు స్పందించారు.

తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా పోస్టు చేశారు. ఆ వయస్సులో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి…టీడీపీ ఫ్లెక్సీని ప్రదర్శించారని అభినందించారు. తాను గతంలో వస్తున్నా మీకోసం పాదయాత్ర చేపట్టానని తెలిపిన చంద్రబాబు…ఆ పాదయాత్రలో శివప్రసాద్ తనతో కలిసి అడుగులేసిన విషయాన్ని గుర్తు చేశారు. సంకల్పం ఉంటే ఏదైనా సాద్యం అని నిరూపించి యువతకు ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు.