Pensions : అన్నమయ్య జిల్లాలో ప్రాణం తీసిన పెన్షన్‌..

నిన్నటి నుండి ఖాతాదారుల ఖాతాల్లో పెన్షన్ జమ అవుతుంది. ఈ క్రమంలో పెన్షన్ దారులు బ్యాంకులకు క్యూ కట్టడం మొదలుపెట్టారు

  • Written By:
  • Publish Date - May 2, 2024 / 02:40 PM IST

ఎన్నికలు (Elections) ఏమోకానీ పెన్షన్ దారుల ప్రాణాలు పోతున్నాయి. ఎన్నికల కోడ్ నేపథ్యంలో పెన్షన్ (Pensions ) దారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. గత నెల కిందటి వరకు వాలంటీర్లు ఇంటికి వచ్చి పెన్షను చేతిలో పెట్టి వెళ్లేవారు. కానీ ప్రస్తుతం ఎన్నికల హడావిడి నడుస్తుండడం తో ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకూడదని ఈసీ ఆదేశాలు జారీచేసింది. వృద్దులు , లేవనెవరికి అధికారులు ఇంటికి వెళ్లి పెన్షన్ ఇవ్వాలని..బ్యాంకు ఖాతా ఉన్న వారికీ నేరుగా మీ ఖాతాలలో డబ్బులు జమ అవుతాయని తెలిపింది. నిన్నటి నుండి ఖాతాదారుల ఖాతాల్లో పెన్షన్ జమ అవుతుంది. ఈ క్రమంలో పెన్షన్ దారులు బ్యాంకులకు క్యూ కట్టడం మొదలుపెట్టారు.

We’re now on WhatsApp. Click to Join.

డబ్బును తీసుకోవాలని కొందరు..అకౌంట్ లో డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకొనేందుకు కొందరు..ఇలా అంత బ్యాంకులకు క్యూ కట్టడం తో తీవ్రంగా ఇబ్బంది అవుతుంది. ఒకేసారి వందల మంది బ్యాంకులకు చేరుకోవడం తో ఆలస్యం అవుతుంది. ఇదే క్రమంలో కొంతమంది వడదెబ్బకు గురి అవుతుండగా..మరికొంతమంది ఎండ వేడి తట్టుకోలేక కుప్పకూలిపోతున్నారు. తాజాగా అన్నమ్మయ్య జిల్లాలో ఓ వ్యక్తి పెన్షన్ కోసం బ్యాంకు కు వెళ్లి లైన్లో నిల్చుని కుప్పకూలి చనిపోయాడు.

అన్నమయ్య జిల్లా (Annamayya District) రాయచోటిలో ఈ విషాదం చోటు చేసుకుంది.. రాయచోటిలోని కెనరా బ్యాంకుకు పెన్షన్‌ కోసం వెళ్లి బ్యాంక్‌ ముందు కుప్పకూలిన వృద్దుడు అక్కడికక్కడే కన్నుమూశాడు.. మృతుడు సుబ్బన్న (80)గా గుర్తించారు. లక్కిరెడ్డిపల్లి మండలం కాకుళారం గ్రామం పిచ్చిగుంటపల్లెకుకు చెందిన ముద్రగడ సుబ్బన్న.. పెన్షన్ కోసం వెళ్లి.. బ్యాంకు వద్ద కుప్పకూలి మృత్యువాత పడ్డారు.

Read Also : Modi Vs Rahul : ‘యువరాజు’ను భారత ప్రధాని చేయాలని పాక్ తహతహ : ప్రధాని మోడీ