బద్వేల్ ఉప ఎన్నిక‌లో 60శాతం పొలింగ్‌

బద్వేల్ ఉపఎన్నిక హోరాహోరీగా జ‌రిగింది. ఉద‌యం నుంచే ఓట‌ర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల వ‌ద్ద బారులు తీరారు.

  • Written By:
  • Updated On - October 30, 2021 / 10:10 PM IST

బద్వేల్ ఉపఎన్నిక హోరాహోరీగా జ‌రిగింది. ఉద‌యం నుంచే ఓట‌ర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల వ‌ద్ద బారులు తీరారు. దాదాపు 2ల‌క్ష‌ల మంది ఓట‌ర్లున్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో బ‌రిలో 15మంది అభ్య‌ర్ధులున్నారు. మొత్తం 281 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జ‌రిగింది.

చ‌దువురుమ‌దురు ఘ‌ట‌న‌లు మిన‌హా పోలింగ్ ప్ర‌శాంతంగా జ‌రిగింద‌ని ఎన్నిక‌ల అధికారులు చెప్పారు. పోలింగ్ ప్ర‌క్రియ మొత్తం వీడియో రికార్డింగ్ చేశారు. 3వేల మంది పోలీస్ బందోబ‌స్త్ చేశారు అధికారులు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో వేరే నియోజ‌క‌వ‌ర్గ ఓట‌ర్లు త‌మ ఓటుహ‌క్కును వినియోగించుకునేందుకు వ‌చ్చారు. అయితే, వారిని ప‌ట్టుకున్న పోలింగ్ ఏజెంట్లు గొడ‌వ‌కు దిగారు. సాయంత్రం 7 గంట‌ల స‌మ‌యానికి 60 శాతం ఓట్లు పోల‌య్యాయి.