ఏపీ (AP)లోని దివ్యాంగులకు (Disabled Persons) టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) తీపి కబురు అందించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దివ్యాంగులకు రూ.6 వేల పింఛను (6 Thousand Pension) అందజేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో చంద్రబాబు..గత కొద్దీ రోజులుగా ప్రజాగళం పేరుతో యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు జిల్లాలో యాత్ర పూర్తి చేసుకోగా..అడుగడుగునా చంద్రబాబుకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. యాత్రలో ఐదేళ్ల వైసీపీ పాలన ఫై నిప్పులు చెరుగుతూ..తాము అధికారంలోకి వచ్చిన వెన్తనె ఇలాంటి అభివృద్ధి చేస్తారో..ఎలాంటి సంక్షేమ పథకాలు తీసుకొస్తారో తెలియజేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
తాజాగా ఈరోజు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో దివ్యాంగులతో చంద్రబాబు సమావేశమయ్యారు. మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో చంద్రబాబును కలిసిన దివ్యాంగులు, తమ సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. వారి సమస్యలను విన్న చంద్రబాబు.. సమస్యల పరిష్కారానికి ఎన్డీయే కూటమి కట్టుబడి ఉందని, అధికారంలోకి రాగానే దివ్యాంగులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దివ్యాంగులకు 6 వేల రూపాయల పింఛను ఇస్తామని భరోసా ఇచ్చారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో దివ్యాంగులు తీవ్రంగా నష్టపోయారని, ఎన్‌డీఏ కూటమి అధికారంలోకి రాగానే వారి సమస్యలను పరిష్కరించి చేయూత అందిస్తామని బాబు స్పష్టం చేశారు. దివ్యాంగులు అంతా కూడా బాబు నిర్ణయం పట్ల హర్ష వ్యక్తం చేశారు.
రానున్న ఎన్నికల్లో ఎన్‌న్డీఏ కూటమి అభ్యర్ధుల విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని పల్నాడు జిల్లా నేతలకు దిశానిర్దేశం చేశారు. పల్నాడు జిల్లాలో టీడీపీ సహా జనసేన, బీజేపీ అభ్యర్ధులకు జనం నీరాజనం పడుతున్నారని, వైసీపీ ఓటమి ఖాయమని చంద్రబాబు పేర్కొన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయిన తీరును ప్రజలకు అర్ధమయ్యేలా వివరించాలని నేతలకు సూచించారు.
Read Also : CSK vs KKR: చెపాక్‌లో గేమ్ ఛేంజర్ ఎవరు ?