బెంగళూరులోని ప్రముఖ షాంగ్రి-లా హోటల్‌లో జరిగిన APAC-2025 సమావేశంలో అతిథి ముసుగులు వచ్చి విదేశీ ప్రతినిధుల డబ్బు దొంగిలించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 57 ఏళ్ల చింతకిండి శ్రీనివాసులు (Srinivasulu ) అనే వ్యక్తి ఈ దారుణం చేశాడు. జూన్ 21 నుంచి 28 వరకు జరిగిన ఈ కార్యక్రమంలో విదేశీ అతిథులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. జూన్ 23న తైవాన్‌కు చెందిన ప్రతినిధి రొజర్ షేంగ్ బ్యాగులో నుంచి 300 డాలర్లు, 3,000 తైవానీస్ డాలర్లు గల్లంతైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించగా, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా శ్రీనివాసులు దొంగతనానికి పాల్పడినట్లు స్పష్టమైంది.
Pakistan Floods : పాకిస్తాన్ మాన్సూన్ భీభత్సం.. వర్షాలు వరదలతో 116 మృతి, ప్రజల్లో ఆందోళన
పోలీసులు అతడి కోసం గాలింపు మొదలుపెట్టి ఇటీవలే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి పోలీసులు రూ.41,079 విలువైన డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 270 అమెరికన్ డాలర్లు, 2,900 తైవానీస్ డాలర్లు, 200 ఆస్ట్రేలియన్ డాలర్లు, 10,000 లావోషియన్ కిప్ ఉన్నాయి. విచారణలో శ్రీనివాసులు ఇటీవలి కాలంలో పలు ఐదు స్టార్ హోటళ్లలో ఇదే మోసం చేసినట్లు ఒప్పుకున్నాడు. అతడి పై ఇంకొన్ని హైఎండ్ హోటళ్లలో జరిగిన దొంగతనాల కేసులు నమోదు చేయబడ్డాయి. పోలీసులు ఇతడి నుండి మరిన్ని వివరాలు సేకరించేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
