AP Danger Bells : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 44 శాతం భూభాగానికి తుఫానులు, ప్రకృతి విపత్తుల ముప్పు ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. గ్లోబల్ వార్మింగ్ (భూతాపం) పెరగడంతో కొన్ని జిల్లాలకు వరద ముప్పు, మరికొన్ని జిల్లాలకు కరవు ముప్పు పొంచి ఉందన్నారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్-జూన్ మధ్యలో, డిసెంబరు తర్వాత ఏపీపై తుఫానుల ప్రభావం పడుతోంది. నైరుతి రుతుపవనాల సమయంలో సగటున 1 తుఫాను కోస్తా తీరాన్ని తాకుతోంది. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో గోదావరి, కృష్ణా, తుంగభద్ర, పెన్నా, నాగావళి, వంశధార తదితర నదుల్లో నీటిమట్టాలు పెరుగుతున్నాయి. అసోంలోని ఐఐటీ గువహటి, హిమాచల్ ప్రదేశ్‌లోని ఐఐటీ మండీ కలిసి సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ పాలసీ (సీఎస్‌టీఈపీ) సహకారంతో ఇటీవలే నిర్వహించిన అధ్యయనంలో ఈవివరాలు వెల్లడయ్యాయి.
Also Read :Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల సర్వే.. 2.35 లక్షల మంది పెంకుటిళ్లలో, 2.17 లక్షల మంది రేకుల ఇళ్లలో
స్టడీ రిపోర్టులోని కీలక అంశాలు..
- ఏపీలో వరద ముప్పు అధికంగా ఉన్న ఉమ్మడి జిల్లాలలో పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు(AP Danger Bells) ఉన్నాయి.
- ఏపీలో వరద ముప్పు మధ్యస్థంగా ఉన్న ఉమ్మడి జిల్లాలలో శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, ప్రకాశం, కర్నూలు, అనంతపురం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు ఉన్నాయి.
- ఏపీలో వరద ముప్పు స్వల్పంగా ఉన్న ఉమ్మడి జిల్లాలలో విశాఖపట్నం, వైఎస్సార్, చిత్తూరు ఉన్నాయి.
- ఏపీలో కరువు ముప్పు అధికంగా ఉన్న ఉమ్మడి జిల్లాలలో విశాఖపట్నం, గుంటూరు, ప్రకాశం, కర్నూలు ఉన్నాయి.
- ఏపీలో కరువు ముప్పు మధ్యస్థంగా ఉన్న ఉమ్మడి జిల్లాలలో శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, వైఎస్సార్, అనంతపురం, చిత్తూరు ఉన్నాయి.
- ఏపీలో కరువు ముప్పు స్వల్పంగా ఉన్న ఉమ్మడి జిల్లాలలో నెల్లూరు ఉంది.
Also Read :Formula E Race Case : ఆ ఇద్దరి వాంగ్మూలాలను సేకరించాకే కేటీఆర్ విచారణ ?
తీర ప్రాంతాల్లో ఇవి చేయాలి..
- ఏపీలోని తీర ప్రాంతాలకు వరదల ముప్పు చాలా ఎక్కువగా ఉంది. తీర ప్రాంతాల్లో పూరిళ్లు, పెంకుటిళ్లలో నివసించేవారికి పక్కాగృహాలు నిర్మించడం ముఖ్యం.
- తీర ప్రాంతాల్లో విద్యుత్తుపంపిణీ వ్యవస్థను బలోపేతం చేసుకోవాలి. పాత విద్యుత్తు స్తంభాల, విద్యుత్ తీగల స్థానంలో కొత్తవాటిని ఎప్పటికప్పుడు రీప్లేస్ చేయాలి.
- తీర ప్రాంతాల్లో భూగర్భ విద్యుత్తు వ్యవస్థ ఏర్పాటుపై ఫోకస్ చేయాలి.
- తీర ప్రాంతాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లు, కల్వర్టులు, వంతెనలను బలంగా దీర్ఘకాలిక ప్రణాళికలతో నిర్మించాలి.