434 Staff Nurse Posts : ఏపీలో 434 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీ.. దరఖాస్తు ప్రక్రియ ఇదీ

434 Staff Nurse Posts :  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 434  స్టాఫ్ నర్స్  ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడింది. 

  • Written By:
  • Publish Date - September 23, 2023 / 02:07 PM IST

434 Staff Nurse Posts :  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 434  స్టాఫ్ నర్స్  ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడింది.  కొత్తగా ప్రారంభించిన 5 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ జాబ్స్ ను భర్తీ చేసేందుకు ఏపీ ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నోటిఫికేషన్‌ ను రిలీజ్ చేసింది. అయితే వీటిలో 68 పోస్టులను వైద్య విధాన పరిషత్‌ ఆసుపత్రుల్లో భర్తీ చేయనున్నట్లు తెలిపింది. జనరల్ నర్సింగ్, మిడ్‌వైఫరీ (జీఎన్‌ఎం) లేదా బీఎస్సీ(నర్సింగ్) పాస్ అయినవారు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఈ పోస్టుల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సెప్టెంబరు 21న ప్రారంభమైంది. వీటికి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అక్టోబరు 5.

Also read : Pakistan Visas: పాకిస్తాన్ జట్టుకు వీసా కష్టాలు.. న్యూజిలాండ్ తో పాక్ వార్మప్ మ్యాచ్ డౌటే..?!

ఈ ఏడాది జులై 1 నాటికి వయసు 42 సంవత్సరాలకు మించని వాళ్లు మాత్రమే అప్లై చేయాలి.  ఓసీ అభ్యర్థులు రూ.500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, బీసీ అభ్యర్థులు రూ.300 ఫీజుగా చెల్లించాలి.మొత్తం 434 స్టాఫ్ నర్స్ పోస్టులలో జోన్-1 పరిధిలో  86, జోన్-2 పరిధిలో 220, జోన్-3లో 34, జోన్-4లో 94 ఉన్నాయి. కేవలం ఆఫ్‌లైన్‌ ద్వారా ఈ అప్లికేషన్లను సమర్పించాల్సి ఉంటుంది. అకడమిక్ మెరిట్, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఈ రిక్రూట్మెంట్ (434 Staff Nurse Posts) చేస్తారు.