Site icon HashtagU Telugu

42 teachers arrested: టెన్త్ పరీక్ష పత్రాల లీక్…42మంది టీచర్లు సస్పెండ్..!!

Crime

Crime

ఏపీలో పదవతరగతి పరీక్ష పత్రాల లీకేజ్ వ్యవహారం హాట్ టాపిగ్గా మారింది. మొదటి పరీక్ష మొదలైనప్పటి నుంచి ప్రశ్నాపత్రాలు ఏదోక చోట లీక్ అవుతూనే ఉన్నాయి. నంద్యాల, చిత్తూరు, శ్రీ సత్యసాయి జిల్లాల్లోజరిగిన పేపర్ లీక్ ఘటలన్ని ఇంకా మరవకముందే…మరోసారి కృష్ణా, కర్నూలు జిల్లాల్లోపేపర్ లీక్ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. సోమవారం మ్యాథ్స్ పేపర్ సెల్ ఫోన్లో ప్రత్యక్షం కావడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు.
ఈ పేపర్ లీక్ అయినట్లు తెలుసుకున్న జిల్లా ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. యువకుల్ని అదుపులోకి తీసుకుని విచారించారు. తామే స్వయంగా పరీక్ష పత్రాలు ఫోటోలు తీసుకున్నట్లు వారు అంగీకరించారు. కాపీ చిట్టీలు మార్చుకుంటున్న సమయంలో ఆ యువకులు దొరికిపోయారు. మొబైల్ తీసి చూడగా ప్రశ్నాపత్రం లీక్ అయిన విషయం వెలుగులోకి వచ్చింది. దీని వెనక ఎవరి హాస్తముందో విచారించాలని ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు వరుసగా లీక్ ఘటనలు వెలుగు చూస్తుండటంతో సర్కార్ సీరియస్ అయ్యింది.
ఇప్పటివరకు ఈ పత్రాల్ని లీక్ చేసిన 42మంది టీచర్లను అరెస్టు చేయగా…ప్రభుత్వం వారిని సస్పెండ్ చేసింది. ఉద్దేశ్యపూర్వకంగానే మాల్ ప్రాక్టీస్, వ్యవహారలు జరుగుతున్నాయని విద్యాశాఖ ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. ఇది నిజమని రుజువైనట్లయితే…ఆయా టీచర్స్ ను విధుల నుంచి తొలగించాలని విద్యాశాఖ యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మాల్ ప్రాక్టీస్ ఉదంతంపై కఠిన చర్యలు తీసుకునేందుకు విద్యా శాఖ రెడీ అయ్యింది.

Exit mobile version