YS Sharmila : వివేకా హత్యలో 40 కోట్ల రూపాయలు చేతులు మారాయి – వైస్ షర్మిల

వివేకా హత్య కు సంబంధించి కోట్ల రూపాయిలు చేతులు మారినట్లు కీలక విషయాలను వెల్లడించింది

Published By: HashtagU Telugu Desk
Viveka Murder 40cr

Viveka Murder 40cr

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైస్ షర్మిల (YS Sharmila) ..ఎన్నికల ప్రచారంలో తన దూకుడు ను కనపరుస్తుంది. ముఖ్యంగా జగన్ , అవినాష్ లను టార్గెట్ గా చేసుకొని తన ప్రచారం కొనసాగిస్తూ వస్తుంది. ముఖ్యంగా బాబాయ్ వివేకా హత్య గురించి ప్రస్తావిస్తూ వస్తుంది. ఈరోజు వివేకా హత్య కు సంబంధించి కోట్ల రూపాయిలు చేతులు మారినట్లు కీలక విషయాలను వెల్లడించింది. వివేకా హత్యకు సంబంధించిన ఆధారాలు, ఫోన్ రికార్డులతోపాటు డబ్బు చేతులు మారినట్టు సాక్షాలున్నా ప్రభుత్వం ఐదేళ్లగా నిందితులపై ఎందుకు చర్యలు తీసుకోలేని ప్రశ్నించారు షర్మిల.

We’re now on WhatsApp. Click to Join.

కడప జిల్లా కమలాపురంలో జరిగిన రోడ్ షోలో మాట్లాడిన ఆమె, వివేకా హత్య కు సంబంధించి దాదాపు రూ.40 కోట్లు చేతులు మారాయని.. అంత డబ్బు ఎవరి దగ్గర ఉంటుందని ప్రశ్నించారు. అవినాష్‌రెడ్డి కాకపోతే ఎవరు చంపినట్టు? వెనుక ఎవరున్నారని ఆరోపించారు. జగన్ తన అధికారాన్ని అడ్డుకుని అవినాష్‌రెడ్డిని కాపాడుతున్నారని పేర్కొన్నారు. ఏడుసార్లు గొడ్డలితో నరికితే వివేకా ఎముకలు బయటకు వచ్చాయని సీబీఐ చెబుతోందన్నారు. ఇళ్లంతా రక్తమయినా సాక్షి ఛానెల్‌లో మాత్రం హార్ట్‌ఎటాక్ అని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఇదిలా ఉంటె ప్రచారంలో వివేకా హత్య గురించి ప్రస్తావించకూడదని ఇప్పటికే కోర్ట్ ఆదేశాలు జారీచేసింది. అయినప్పటికీ షర్మిల వివేకా హత్య గురించి మాట్లాడుతుంది వస్తుంది. ఈ క్రమంలో ఈమె ఫై కేసు కూడా నమోదు అయ్యింది. అయినప్పటికీ ఈరోజు కూడా అలాగే ప్రస్తావించారు.

Read Also : Leg Injury : పవన్ కళ్యాణ్ కు గాయం చేసిన అభిమానులు

  Last Updated: 07 May 2024, 10:11 PM IST