Site icon HashtagU Telugu

4 Killed : అనంత‌పురం జిల్లాలో విషాదం.. క‌రెంట్ షాక్‌ త‌గిలి న‌లుగురు మృతి

Deaths

Deaths

అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది, క‌రెంట్ షాక్ త‌గిలి న‌లుగురు వ్య‌వ‌సాయ కూలీలు మృతి చెందారు. అనంత‌పురం జిల్లా బొమ్మనహాల్ మండలం దర్గా హొన్నూరు గ్రామంలో పొలంలో పని చేస్తుండగా 33కేవీ లైన్ తెగిపడి నలుగురు మహిళ‌లు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను పొరుగున ఉన్న కర్ణాటకలోని బళ్లారి ఆసుపత్రికి తరలించగా వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఈ ఘటనపై ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిన అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్, లైన్ ఇన్‌స్పెక్టర్‌లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఎలక్ట్రికల్ సేఫ్టీ డైరెక్టర్‌ను ఆదేశించారు. దీంతో విద్యుత్ శాఖ ఆ ప్రాంతంలో విద్యుత్‌ను నిలిపివేసింది

Exit mobile version