Site icon HashtagU Telugu

Maha Shivaratri Buses: మహాశివరాత్రి సందర్భంగా 3,800 ప్రత్యేక బస్సులు!

3,800 Special Buses On The Occasion Of Maha Shivaratri!

3,800 Special Buses On The Occasion Of Maha Shivaratri!

అమరావతి: మహాశివరాత్రి (Maha Shivaratri) సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి శైవక్షేత్రాలకు 3,800 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఏపీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది. వీటిలో అత్యధికంగా కోటప్పకొండకు 675, శ్రీశైలానికి 650, కడప జిల్లా పొలతలకు 200, పట్టిసీమకు 100 బస్సులు ఏర్పాటు చేసినట్టు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు.

ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జిలే ఉంటాయని తెలిపారు. రాష్ట్రంలోని 101 శైవక్షేత్రాలకు 25 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నామని చెప్పారు. శైవక్షేత్రాల వద్ద అన్ని సౌకర్యాలతో తాత్కాలిక బస్‌స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఘాట్‌రోడ్లపై నైపుణ్యం కలిగిన డ్రైవర్లతో బస్సుల నడిపించనున్నట్లు ఆర్టీసీ ఎండీ తెలిపారు.

Also Read:  Maha Shivaratri: శివుడు స్వయంగా పార్వతికి చెప్పిన కథ ఇది