BC-Welfare : నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు : సీఎం చంద్రబాబు

గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా బీసీలు స్థానిక సంస్థల్లో 34 శాతంగా ఉన్న రిజర్వేషన్లను కోల్పోయారని, రిజర్వేషన్లు 34 శాతం నుంచి 24 శాతంకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తగ్గడంతో బీసీలు 16,500 పదవులకు దూరమయ్యారని సీఎం తెలిపారు.

Published By: HashtagU Telugu Desk
Cm Chandrababu

Cm Chandrababu

BC-Welfare : సీఎం చంద్రబాబు బీసీ వెల్ఫేర్‌పై ఈరోజు (సోమవారం) సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టంపై మంత్రుల కమిటీ సూచనలపై కసరత్తు చేశారు. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. స్థానిక సంస్థల్లో బీసీలకు తిరిగి 34 శాతం రిజర్వేషన్ల సాధన కోసం న్యాయమైన పోరాటం చేస్తామని వెల్లడించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా బీసీలు స్థానిక సంస్థల్లో 34 శాతంగా ఉన్న రిజర్వేషన్లను కోల్పోయారని, రిజర్వేషన్లు 34 శాతం నుంచి 24 శాతంకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తగ్గడంతో బీసీలు 16,500 పదవులకు దూరమయ్యారని సీఎం తెలిపారు.

బీసీ హాస్టళ్లలో వసతుల కల్పన, బాలికల హాస్టళ్ల తక్షణ మరమ్మతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. పింఛన్ల తొలగింపు కాదు…పింఛన్ల తనిఖీ జరుగుతుందని సీఎం చంద్రబాబు చెప్పారు. స్కిల్ ఎడ్యుకేషన్ కోసం 104 బీసీ హాస్టళ్లలో ఎస్.ఆర్.శంకరన్ నాలెడ్జ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రంలో మొత్తం 1100కు పైగా బీసీ విద్యార్థుల హాస్టల్ లు ఉన్నాయని తెలిపారు. వీటిలో 660 ప్రభుత్వ భవనాలు, 450 అద్దె భవనాలు ఉన్నాయని.. గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన 110.52 కోట్ల డైట్ బిల్లులో కూటమి ప్రభుత్వం 76.38 కోట్లు చెల్లించిందని పేర్కొన్నారు. మరో 34.14 కోట్లు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు.

Read Also:  Mythri Movie Makers : రేవతి కుటుంబానికి పుష్ప మేకర్స్ రూ.50 లక్షల ఆర్థిక సాయం

 

  Last Updated: 23 Dec 2024, 08:16 PM IST