30 Years Prudhvi : పవన్ ను ఓడించేందుకు ఇంటికి లక్ష.. యువతకు బైక్స్ – 30 ఇయర్స్ ఫృథ్వీ

జూన్ 4వ తేదీన తర్వాత ఈ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు రాష్ట్రం నుంచి పరారవుతారు

Published By: HashtagU Telugu Desk
Pawan 30yeras

Pawan 30yeras

ఏపీలో ఎన్నికలు (AP Elections) సమీపిస్తున్న తరుణంలో అధికార – ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. పార్టీల అధినేతలు కాదు ..పార్టీ నేతలు సైతం ఒకరిపై ఒకరు విమర్శలు , ప్రతి విమర్శలు చేసుకుంటూ ఎన్నికల వేడిని మరింత పెంచుతున్నారు. తాజాగా జనసేన నేత 30 ఇయర్స్ ఫృథ్వీ (30 Years Prudhvi) వైసీపీ పార్టీ (YCP Party) ఫై కీలక వ్యాఖ్యలు చేసారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ను ఓడించేందుకు ఇంటికి లక్ష రూపాయలు ఇస్తాం..యువతకు బైక్స్ ఇస్తామని ఆశచూపుతున్నారు. కానీ ఆ నియోజకవర్గ ప్రజలు మాత్రం అలాంటి ప్రలోభాలకు దూరంగా ఉంటున్నారు అని పృద్వి చెప్పుకొచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

నేను పవన్ కల్యాణ్ వదిలిన బాణాన్ని. గతంలో జగన్ వదిలిన బాణం షర్మిల కాంగ్రెస్ బాణంగా మారి అన్ననే గట్టిగా కొడుతున్నది. మేము ఓటు వేసి గట్టిగా కొడుతాం. మా గుర్తు గ్లాస్ గురించి అతిగా మాట్లాడితే.. తగిన రీతిలో బుద్ది చెబుతాం అని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయం అని ఆయన జోస్యం తెలిపారు. జూన్ 4వ తేదీన తర్వాత ఈ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు రాష్ట్రం నుంచి పరారవుతారు. పవన్ కల్యాణ్ గెలిచి అసెంబ్లీలో తన గళాన్ని వినిపిస్తారని ధీమా వ్యక్తం చేసారు. అలాగే గుడివాడ అమర్నాధ్ ఫై కూడా పృద్వి కీలక వ్యాఖ్యలు చేసారు. ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్‌కు ఆ మంత్రిత్వ శాఖను నడిపే అర్హతలేదు. ఈయన గుడ్డుకు ప్రసిద్ది. ఈ ప్రాంతంలో భూములను ఆక్రమించుకొనేందుకు ఈయనను ఐటీ మంత్రిగా పెట్టుకొన్నారు. ఆయన గాజువాకలో ఓడిపోవడం ఖాయం అని పృథ్వీరాజ్ అన్నారు.

Read Also : Memantha Siddham : చంద్రబాబుకు శవరాజకీయాలు, కుట్రలు అలవాటే – జగన్

  Last Updated: 27 Mar 2024, 09:40 PM IST