Site icon HashtagU Telugu

30 Years Prudhvi : వైసీపీ కాదు.. ఉగ్రవాదుల ఫ్యాక్టరీ

Prudvi Jagan

Prudvi Jagan

ఏపీలో ఎన్నికల పోలింగ్ కు పట్టుమని మూడు వారాలు కూడా లేకపోయేసరికి అన్నిపార్టీల నేతలు, క్యాంపెయినర్లు మరింత దూకుడు పెంచారు. ఈ క్రమంలో డైలాగ్ వార్ రోజు రోజుకు పిక్ స్టేజ్ కు వెళ్తుంది. ఒకరి ఫై ఒకరు విమర్శలు, ప్రతివిమర్శలు , సవాళ్లు , ప్రతి సవాళ్లు చేసుకుంటూ ఎన్నికల వేడిని మరింత పెంచుతున్నారు. ఈ క్రమంలో జనసేన పార్టీ నేత, సినీ నటుడు 30 ఇయర్స్ పృథ్వి జనసేన విజయం కోసం ప్రచారం చేస్తూ ఇంటింటికి వెళ్తూ..జనసేన కు ఓటు వేయాలని , కూటమిని గెలిపించాలని కోరుతూ వస్తున్నారు. ఇదే క్రమంలో వైసీపీ పార్టీ ఫై ఘాటైన విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

వాస్తవానికి గత ఎన్నికల్లో ఈయన వైసీపీ పార్టీ లో చేరి..రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేసారు. దీనికి గాను వైసీపీ టీడీపీ లో కీలక పదవి ఇచ్చారు. కానీ అంతేత్వరగా పలు ఆరోపణలు నడుమ ఆ పదవికి రాజీనామా చేసి..వైసీపీ పార్టీకి సైతం రాజీనామా చేసి సినిమాలు చేసుకుంటూ బిజీ అయ్యారు. ఈ మధ్యనే మళ్లీ జనసేన పార్టీ లో చేరి..పవన్ కళ్యాణ్ గెలుపుకు కృషి చేస్తున్నాడు. గత కొద్దీ రోజులుగా జనసేన నేతల కోసం ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఈరోజు విజయనగరంలో పృథ్వీరాజ్ (Prithviraj) ప్రచారం నిర్వహించారు. తాను కొద్దీరోజులు వైసీపీలో కొనసాగానని .. వైసీపీలో కంటిన్యూ అయినందుకు క్షమాపణలు తెలిపారు. వైసీపీ పార్టీ కాదని ఉగ్రవాదుల ఫ్యాక్టరీ అని పృథ్వీరాజ్ సంచలన ఆరోపణలు చేశారు. పవిత్ర తిరుమల క్షేత్రాన్ని కూడా రాజకీయాలకు కేంద్ర బిందువు చేశారని మండిపడ్డారు. ఐదేళ్లలో అన్ని రంగాలను సీఎం జగన్ నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసారు. నెల్లిమర్ల జనసేన అభ్యర్థి లోకం మాధవిని గెలిపించాలని కోరారు.

ఇటు ఈరోజు పిఠాపురంలో మెగా హీరో వరుణ్ తేజ్..బాబాయ్ ని గెలిపించాలంటూ ఓటర్లను కోరారు. ఈయనే కాదు గత కొద్దీ రోజులుగా పలువురు సినీ స్టార్స్ , బుల్లితెర స్టార్స్ పిఠాపురంలో పవన్ గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. ఈసారి పవన్ విజయం పక్క అని అంత ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Read Also : Amazon Summer Sale 2024 : గ్రేట్ సమ్మర్‌ సేల్‌కు సిద్దమైన అమెజాన్..డిస్కౌంట్ లే డిస్కౌంట్లు