సినీ నటుడు , జనసేన నేత 30 ఇయర్స్ పృథ్వీ (30 Years Prudhvi)..వైసీపీ సర్కార్ (YCP Govt) ఫై ఘాటు వ్యాఖ్యలు చేసారు. 175 కు 175 స్థానాల్లో గెలవబోతున్నామని చెపుతున్న వైసీపీ..మళ్లీ 90 స్థానాల్లో అభ్యర్థులను ఎందుకు మారుస్తుందని ప్రశ్నించారు. ఏప్రిల్ నెలలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో అధికార పార్టీ తో పాటు ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల ఫై కసరత్తులు చేస్తున్నాయి. టీడీపీ – జనసేన పార్టీలు ఉమ్మడి గా పోటీ చేస్తుండగా..వైసీపీ సింగిల్ గా పోటీ చేయబోతుంది. కాగా గత ఎన్నికల్లో ఎలాగైతే విజయం సాధించామో..రాబోయే ఎన్నికల్లో కూడా అలాగే విజయం సాధించాలని…దానికి తగ్గట్లు కసరత్తులు మొదలుపెట్టింది వైసీపీ.
We’re now on WhatsApp. Click to Join.
ఈ క్రమంలో అధినేత జగన్..అభ్యర్థుల మార్పులు చేస్తున్నారు. ఈసారి దాదాపు 100 మందికి టికెట్స్ ఇవ్వకుండా కొత్త వారికీ ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలకు టికెట్స్ ఫై క్లారిటీ ఇచ్చారు. అలాగే 11 నియోజకవర్గాలకు సంబదించిన ఇన్ ఛార్జ్ లను సైతం మార్చేశారు. కాగా వైసీపీ మార్పులపై పృద్వి ఘాటైన వ్యాఖ్యలు చేసారు. గత ఎన్నికల సమయంలో వైసీపీతో ప్రయాణం చేసిన పృథ్వీ.. ఎస్వీబీసీ చైర్మన్ కూడా అయ్యారు. ఆ తర్వాత ఆడియో టేప్ కలకలం తర్వాత.. తన పదవిని పోగొట్టుకుని పార్టీకి దూరం అయ్యారు. చాలాకాలంటా రాజకీయాలను దూరంగా ఉన్న పృథ్వీ.. జనసేన పార్టీలో చేరతారంటే జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. రానున్న ఎన్నికల్లో వైసీపీ 175 స్థానాల్లో గెలుస్తానంటుంది. నిజంగా అన్ని స్థానాల్లో గెలుస్తుందనుకుంటే.. 90 స్థానాల్లో అభ్యర్థులను ఎందుకు మార్చిందని పృథ్వీ ప్రశ్నించారు.
రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం ఖాయం, రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోతుందని జోస్యం చెప్పారు. 135 అసెంబ్లీ స్థానాల్లో, 25 ఎంపీ స్థానాల్లో టీడీపీ – జనసేన కూటమి విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు. తాను ఎక్కడి నుంచైనా పోటీ చేసేందుకు సిద్ధమని తెలిపారు.
Read Also : Bhupalpally Collector : అటెండర్ తో బూట్లను మోయించిన భూపాలపల్లి జిల్లా కలెక్టర్