Site icon HashtagU Telugu

3 Capitals : `వాల్తేరు వీర‌య్య‌`కు `వైజాగ్ రాజ‌ధాని` సెగ‌

3 Capitals

Valtare

`వాల్తేరు వీర‌య్య` మెడ‌కుమూడు రాజ‌ధానుల(3 Capitals) అంశం చుట్టుకుంది. విశాఖ‌లో జ‌రిగిన ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్లో మెగా స్టార్ చిరంజీవి(Megastar) విశాఖ రాజధానికి జై కొట్టారు. భీమ‌లి వ‌ద్ద స్థ‌లం కొనుగోలు చేసి ఇళ్లు క‌ట్టుకుంటాన‌ని ప్ర‌క‌టించారు. విశాఖ పౌరునిగా ఉంటాన‌ని వెల్ల‌డించారు. దీంతో మూడు రాజ‌ధానుల‌కు(3 Capitals) మ‌ద్ధ‌తు ప‌లికిన చిరంజీవికి వైసీపీ అభినంద‌న‌లు తెలుపుతోంది. అంతేకాదు, ఆయ‌న వ్యాఖ్య‌ల‌ను ప్ర‌చురించిన ప్ర‌తికా క్లిప్పింగ్ ల‌ను జోడిస్తూ వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేయ‌డం రాజ‌కీయాన్ని హీటెక్కించ‌డంతో పాటు సినిమా హిట్ అండ్ ఫ‌ట్ మీద మూడు రాజ‌ధానుల అంశం రాజుకుంది.

మూడు రాజ‌ధానులకు అనుకూలంగా..( 3 Capitals)

మెగాస్టార్ చిరంజీవి(Megastar) గ‌తంలోనూ మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌న‌కు అనుకూలంగా మాట్లాడారు. అసెంబ్లీలో సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రెండేళ్ల క్రితం బిల్లు పెట్టిన సంద‌ర్భంగా మ‌ద్ధ‌తు ప‌లికారు. ఏపీలోని రాజ‌కీయ‌, భౌగోళిక‌, సామాజిక వ్య‌త్యాసాల దృష్ట్యా మూడు రాజ‌ధానులు ఉండాల‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఆ వీడియో సోష‌ల్ మీడియాలో ఇప్ప‌టికీ వైర‌ల్ గా తిరుగుతోంది. పైగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితో స‌న్నిహితంగా ఉంటున్నారు. సినిమా టిక్కెట్ల ఆన్ లైన్, ధ‌రల విష‌యంలో మాట్లాడేందుకు ప‌ర్స‌న‌ల్ గా చిరంజీవి సీఎంను క‌లిశారు. రెండుసార్లు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆతిథ్యాన్ని స్వీక‌రించారు. విందును మ‌రిచిపోలేన‌ని చిరంజీవి అండ్ ఫ్యామిలీ సంబ‌ర ప‌డింది.

Also Read : RIP RGV : జ‌గ‌న్ కు వ‌ర్మ‌, శ్రీరెడ్డి జై! స్లీప‌ర్ సెల్స్ త‌ర‌హాలో సోష‌ల్ సెల్స్

గ‌త సంక్రాంతి సంద‌ర్భంగా చిరంజీవి స‌తీస‌మేతంగా సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ఇంటికి వెళ్లారు. ప్ర‌త్యేక విమానంలో వెళ్లిన చిరంజీవి గొప్ప ఆతిథ్యాన్ని స్వీక‌రించారు.అప్ప‌టికే మూడు రాజ‌ధానుల‌కు జై కొట్టిన చిరంజీవిని సీఎం ద‌గ్గ‌ర‌కు తీసుకున్నారు. ఇటీవ‌ల ప్ర‌ధాని మోడీ భీమ‌వ‌రం వ‌చ్చిన సంద‌ర్భంగా ప్ర‌త్యేకంగా ఆ వేదిక మీద చిరంజీవిని కూర్చొబెట్టారు. స్పెషల్ గా మోడీ ఆయ‌న‌తో మాట్లాడారు. ఇవ‌న్నీ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ముందుగా వేసిన స్కె చ్ ప్ర‌కారం జ‌రిగాయ‌ని రాజ‌కీయ స‌ర్కిల్స్ లోని టాక్‌.

ఉపాస‌న మెగా కోడ‌లిగా..(Megastar)

చిరంజీవి కోడ‌లు ఉపాస‌న ఫ్యామిలీ, వైఎస్ కుటుంబంతో సాన్నిహిత్యంగా ఉంటుంది. ఇటీవ‌ల ఉపాస‌న ప్ర‌ధాని మోడీని క‌లిశారు. ఆ త‌రువాత చిరంజీవికి ప్ర‌త్యేకంగా వేదిక‌, ప‌రిచ‌యం ద‌క్కాయ‌ని తెలుస్తోంది. అపోలో గ్రూప్ తో సుదీర్ఘ కాలం నుంచి వైఎస్ కుటుంబానికి సాన్నిహిత్యం ఉంది. పైగా ఇప్పుడు ఉపాస‌న మెగా కోడ‌లిగా ఉన్నారు. ఇవ‌న్నీ చిరంజీవి, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ద‌గ్గ‌ర‌గా ఉండ‌డానికి అనుకూల అంశాలు. అంతేకాదు, వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి సీఎంగా ఉన్న‌ప్పుడే ప్ర‌జారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఆనాటి నుంచి మెగా స్టార్ కు వైఎస్ కుటుంబానికి విడ‌దీయ‌రాని బంధం ఏర్ప‌డిందట‌. ఆదే ఇప్పుడూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కొన‌సాగిస్తున్నార‌ని తాడేప‌ల్లి వ‌ర్గాల్లోని వినికిడి.

Also Read : BRS Meeting : బీఆర్ఎస్ కు కౌంట్ డౌన్! కేసీఆర్ ఖ‌మ్మం స‌భ అల‌జ‌డి!

ప్ర‌జారాజ్యం పార్టీకి యువ‌రాజ్యం అధ్య‌క్షుడిగా ప‌వ‌న్ ప‌నిచేశారు. ఆ పార్టీ విలీనం త‌రువాత జ‌న‌సేన పార్టీని ప‌వ‌న్ క‌ల్యాణ్ పెట్టుకున్నారు. ఎనిమిదేళ్లుగా న‌డుస్తోన్న జ‌న‌సేన పార్టీ వైపు చిరంజీవి చూడ‌లేదు. ప్ర‌త్య‌క్షంగా ఏనాడూ వేదిక‌ను పంచుకోలేదు. కానీ, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితో వేదిక‌ను మెగాస్టార్ పంచుకున్నారు. కుటుంబ స‌భ్యునిగా కలిసిపోవ‌డంతో పాటు వివాద‌స్ప‌ద‌మైన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తీసుకున్న వివాద‌స్ప‌ద‌ మూడు రాజ‌ధానుల‌కు మ‌ద్ధ‌తుగా చిరంజీవి నిలిచారు. అవ‌కాశం ఉన్న‌ప్పుడ‌ల్లా మూడు రాజ‌ధానుల అంశాన్ని ప్ర‌త్య‌క్షంగానూ, ప‌రోక్షంగానూ బ‌య‌ట‌కు తీసుకొస్తున్నారు. తాజాగా `వాల్తేరు వీర‌య్య‌` సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్లో విశాఖ‌ప‌ట్నంకు జై కొట్టారు. దాన్ని రాజ‌కీయ కోణం నుంచి వైసీపీ ఉప‌యోగించుకుంటూ ప్ర‌చారం చేస్తోంది. దీని ప్ర‌భావం ఆ సినిమా క‌లెక్ష‌న్ల‌పై ప‌డుతుంద‌ని మెగా అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు.