Site icon HashtagU Telugu

2 States Politics : తెలుగు రాష్ట్రాల‌పై BJP స్కెచ్! కేసీఆర్-చంద్ర‌బాబు టార్గెట్‌

2 States Politics

2 States Politics

తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాల‌ను(2 States Politics) బీజేపీ ఢిల్లీ పెద్ద‌లు న‌డిపిస్తున్నారు. ఎనిమిదేళ్లుగా కేసీఆర్ బీజేపీకి స‌హ‌కారం అందించారు. గ‌త ఎన్నిక‌ల నుంచి వైసీపీ సంపూర్ణంగా మ‌ద్ధ‌తు ఇస్తోంది. జ‌న‌సేన పొత్తును కొన‌సాగిస్తోంది. తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నిక‌ల సంద‌ర్భంగా వ్య‌తిరేకించిన‌ప్ప‌టికీ ఇప్పుడు మోడీ పంచ‌న చేర‌డానికి ఆస‌క్తిగా ఉంది. అయితే, తాజాగా బీజేపీని వ్య‌తిరేకిస్తున్న‌ట్టు కేసీఆర్(KCR) క‌నిపిస్తున్నారు. ఆయన వాయిస్ జాతీయానికి మారింది. మోడీ స‌ర్కార్ ను తూల‌నాడుతున్నారు. అందుకే, ఆయ‌న్ను టార్గెట్ చేస్తూ ఢిల్లీ బీజేపీ పెద్ద‌లు రాజ‌కీయాన్ని న‌డుపుతున్నారు. ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి భుజం మీద రాజ‌కీయ తుపాకీని పెట్టి కేసీఆర్ ను అధికారం నుంచి త‌ప్పించాల‌ని ప్ర‌య‌త్నం మొద‌లైయింది.

తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాల‌ను(2 States Politics)

గత వారం ఢిల్లీ వెళ్లిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ఢిల్లీ బీజేపీ పెద్ద‌లు ఇచ్చిన టాస్క్ ప్ర‌కారం తెలంగాణ‌లో బీఆర్ఎస్ అధికారంలో(2 States Politics) ఉండ‌కూడ‌దు. ఆ క్ర‌మంలో ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ ను మ‌ళ్లీ తిర‌గ‌తోడారు. ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి అత్యంత స‌న్నిహితంగా ఉండే శ‌ర‌శ్చంద్రారెడ్డి అప్రూవ‌ర్ గా మారారు. ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ లో ప్ర‌త్యేక విమానంలో బేగంపేట నుంచి ఢిల్లీ డ‌బ్బు త‌ర‌లించిన‌ట్టు అంగీక‌రించారు. మ‌నీలాండ‌రింగ్, హ‌వాలా వెనుక క‌విత ఉన్నార‌ని ఇప్పుడు శ‌ర‌శ్చంద్రారెడ్డి వాగ్మూలం రూపంలో దొరికింది. ఇక ఆమెను అరెస్ట్ చేయ‌డం మాత్రం మిగిలి ఉంది.

Also Read : Sharmila strategy : BRS, కాంగ్రెస్ పొత్తుపై ష‌ర్మిల‌, KCR కు ద‌శ‌ ప్ర‌శ్న‌లు!

వాస్త‌వంగా ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ మీద బీజేపీ లీడ‌ర్లు చేసిన హ‌డావుడి ఆకాశాన్ని అట్టింది. తెలంగాణలో దోచుకున్న సొమ్ము చాల‌క ఢిల్లీ వెళ్లి సారాయి వ్యాపారం చేస్తూ దొరికిన బ‌తుక‌మ్మ అంటూ విమ‌ర్శ‌లు చేశారు. వాళ్ల హ‌డావుడిని చూసిన తెలంగాణ ప్ర‌జ‌లు ఇక క‌విత అరెస్ట్ ఖాయం అనుకున్నారు. సీన్ క‌ట్ చేస్తే, మూడు రోజుల పాటు ఈడీవిచార‌ణ‌కు హాజ‌రైన క‌విత డాట‌ర్ ఆఫ్ ఫైట‌ర్ గా బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఫ‌లితంగా ఆమె గ్రాఫ్ రాజ‌కీయంగా పెరిగింది. అంతే వేగంగా బీజేపీ గ్రాఫ్ ప‌డిపోయింది. ఆ విష‌యాన్ని ఆల‌స్యంగా గ‌మ‌నించిన బీజేపీ ఇప్పుడు మ‌ళ్లీ ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ ను క‌లియ‌బెట్టింది. అందుకు ఆధారాల‌ను చూపేలా శ‌ర‌శ్చంద్రారెడ్డి అప్రూవ‌ర్ గా మారారు. దీనికి వెనుక జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌మేయం ఉంద‌ని కేసీఆర్ వ‌ర్గాల్లోని అనుమానం. అన్న‌ద‌మ్ముల మాదిరిగా ఉన్న కేసీఆర్, జ‌గ‌న్ మ‌ధ్య(2 States Politics) నిప్పు రాజేశారు. దానిలో నుంచి తెలంగాణ రాజ్యాధికారాన్ని బ‌య‌ట‌కు తీయాల‌ని బీజేపీ స్కెచ్ వేసింద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ మీద బీజేపీ లీడ‌ర్లు చేసిన హ‌డావుడి

ఇక ప్ర‌స్తుతం ఏపీలో వైసీపీ, బీజేపీ స‌హ‌జ మిత్ర‌త్వాన్ని(2 States Politics) ప్ర‌ద‌ర్శిస్తున్నాయి. రాజ‌కీయాల‌కు అతీత‌మైన బంధం మోడీ, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మ‌ధ్య ఉంది. అందుకే, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి అన్ని ర‌కాల స‌హాయ స‌హ‌కారాలు అందిస్తున్నాయి. అంటే, చంద్ర‌బాబును వీలున్నంత దూరం పెడుతున్నారు బీజేపీ పెద్ద‌లు. దానికి కార‌ణాలు లేక‌పోలేదు. సాధారంగా వైసీపీ ఓటు బ్యాంకు కాంగ్రెస్ పార్టీ సంప్ర‌దాయ ఓటర్లు. ఒక వేళ వైసీపీ బ‌ల‌హీన‌ప‌డితే, కాంగ్రెస్ పార్టీ ఏపీలో బ‌ల‌ప‌డుతుంది. అది సుతార‌మూ బీజేపీ ఇష్టం ఉండ‌దు. అందుకే, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని కాపాడుతూ వ‌స్తున్నారు. ఇక తెలుగుదేశం, బీజేపీ కెమిస్ట్రీ ఎప్పుడు విజ‌య‌వంత‌మే. కొన్ని సార్లు ఓడిపోయిన‌ప్ప‌టికీ భావ‌జాలం ప్రకారం కాంగ్రెస్ కు వ్య‌తిరేకంగా పుట్టిన పార్టీలు. ఓట‌ర్లు కూడా ఇంచుమించు అదే భావ‌జాలంతో ఉంటారు. ఒక వేళ టీడీపీ బ‌ల‌హీన‌ప‌డితే ఆ ఓట‌ర్లు బీజేపీ వైపు మ‌ళ్లే ఛాన్స్ ఉంది. అందుకే, చంద్ర‌బాబు బ‌ల‌ప‌డ‌కుండా బీజేపీ ఎప్ప‌టిప్పుడు పావులు కదుపుతోంది.

Also Read : KCR Stratagy : కేసీఆర్ కు బ్రాహ్మణుల జ‌ల‌క్‌, స‌ద‌న్ ప్రారంభ ఆహ్వాన ర‌గ‌డ

జ‌న‌సేనా ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌భుత్వం ఓటు బ్యాంకు చీలిపోకుండా చూసుకుంటానంటూ ప్ర‌గ‌ల్భాలు ప‌లికారు. ఢిల్లీ బీజేపీ పెద్ద‌ల‌ను ఆ విధంగా ఒప్పిస్తాన‌ని అన్నారు. కానీ, బీజేపీ పెద్ద‌లు ఆయ‌న మాట ఎప్పుడూ విన‌లేదు. పైగా జ‌న‌సేన పార్టీని బీజేపీలో విలీనం చేయ‌మ‌ని ఒత్తిడి చేసిన‌ట్టు ఒకానొక సంద‌ర్భంగా టాక్ వ‌చ్చింది. ఇప్పుడు టీడీపీతో క‌లిసి వెళ్ల‌డానికి బీజేపీ సిద్దంగా లేదు. ఇలాంటి ప‌రిస్థితుల్లో బీజేపీని వీడి జ‌న‌సేన బ‌య‌ట‌కు రావాలి. కానీ, ఆ ధైర్యం జ‌న‌సేనాని చేయ‌లేరు. అంతిమంగా చంద్ర‌బాబు బ‌ల‌హీన‌ప‌డేలా వ్యూహాల‌ను బీజేపీ, వైసీపీ ర‌చిస్తూ ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాయి. తెలంగాణ‌తో పాటు ఏపీ ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డానికి ఢిల్లీ బీజేపీ పెద్ద‌ల నుంచి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. అంటే, ఈసారి ఎన్నిక‌ల దెబ్బ‌కు తెలంగాణ‌లో కేసీఆర్, ఏపీలో చంద్ర‌బాబు ను అడ్ర‌స్ లేకుండా చేయ‌డ‌మే బీజేపీ ల‌క్ష్యం. ఆ దిశ‌గా అడుగులు వేస్తోన్న బీజేపీకి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సంపూర్ణ స‌హ‌కారం అందిస్తుండ‌గా ప‌వ‌న్ రాజ‌కీయ వీర‌మ‌ర‌ణం అంచుకు చేర‌బోతున్నార‌ని పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ లోని చ‌ర్చ‌.

Also Read : BRS Lucky : కేసీఆర్ కు వ‌రంగా రూ. 2వేల నోట్ ర‌ద్దు