Site icon HashtagU Telugu

AP Jobs : ఏపీ వైద్య కళాశాలల్లో 255 పోస్టులు.. రైల్వేలో 2,860 పోస్టులు

Medical Tests

AP Jobs : ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాస్పత్రుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన డైరెక్ట్/ లేటరల్ ఎంట్రీలో 255  అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.  దీనికి సంబంధించిన రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను(AP Jobs) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో మెడికల్‌ పీజీ (ఎండీ, ఎంఎస్‌, డీఎన్‌బీ, డీఎం) ఉత్తీర్ణులైన వారు అప్లై చేయొచ్చు. అనస్థీషియా, డెర్మటాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, ఈఎన్‌టీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, న్యూక్లియర్ మెడిసిన్, ఓబీజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, సైకియాట్రీ, రేడియో డయాగ్నోసిస్, రేడియోథెరపీ, టీబీ అండ్‌ సీడీ, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్, ఆఫ్తల్మాలజీ, ఫోరెన్సిక్‌మెడిసిన్‌, పాథాలజీ, ఎస్‌పీఎం విభాగాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులకు వయసు 42 సంవత్సరాలకు మించకూడదు. విద్యార్హతలో సాధించిన మార్కులు, రూల్ ఆఫ్‌ రిజర్వేషన్ ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగ దరఖాస్తు రుసుము రూ.1000. బీసీ, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా  రూ.500 చెల్లిస్తే సరిపోతుంది. ఆన్‌లైన్‌‌‌లో దరఖాస్తుల స్వీకరణ ఫిబ్రవరి 1న ప్రారంభమై  ఫిబ్రవరి 15న ముగుస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

2,860 అప్రెంటిస్‌ పోస్టుల భర్తీ

సదరన్ ఇండియన్ రైల్వే వివిధ విభాగాల్లో 2,860 అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి, ఇంటర్‌తో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాసైనవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. అర్హతలున్నవారు ఫిబ్రవరి 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మెరిట్ జాబితా, మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.

ఈ ట్రేడ్‌లలో ఖాళీలు.. 

ఫిట్టర్, వెల్డర్ (గ్యాస్‌ అండ్‌ ఎలక్ట్రిక్‌), ఎంఎల్‌టీ(రేడియాలజీ), ఎంఎల్‌టీ(పాథాలజీ), ఎంఎల్‌టీ(కార్డియాలజీ), టర్నర్‌, సీఓపీఏ, ప్లంబర్‌, పీఏఎస్‌ఏఏ, మెకానిక్- మెషిన్ టూల్ మెయింటనెన్స్, ఎలక్ట్రికల్, కార్పెంటర్, పెయింటర్, కార్పెంటర్, డీజిల్ మెకానిక్, మెకానికల్, అడ్వాన్స్‌డ్‌ వెల్డర్‌, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, మెకానిక్- రెఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, ఎలక్ట్రానిక్ మెకానిక్, మెకానిక్- మోటార్ వైకిల్, అడ్వాన్స్‌డ్ వెల్డర్, స్టెనోగ్రాఫర్&సెక్రేటేరియల్ అసిస్టెంట్, ఇన్ఫర్మేషన్& కమ్యునికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటనెన్స్, పెయింటర్(జనరల్) తదితర ట్రేడుల్లో ఈ ఖాళీలున్నాయి.

అర్హతలు, అప్లికేషన్ వివరాలు.. 

కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి, ఇంటర్‌తో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులైన వారు అప్లై చేయొచ్చు.  దరఖాస్తు ఫీజు రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు లేదు.  ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ  జనవరి 29న ప్రారంభమవుతుంది. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేదీ ఫిబ్రవరి 28. పూర్తి వివరాలకు  https://sr.indianrailways.gov.in/‌  వెబ్‌సైట్‌‌ను చూడొచ్చు. మెరిట్ జాబితా, మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన  వారికి పే స్కేల్  నెలకు రూ.9,000 నుంచి రూ.12,000గా ఉంటుంది. ఫిట్టర్‌, వెల్డర్‌ (గ్యాస్‌ అండ్‌ ఎలక్ట్రిక్‌), మెడికల్‌ ల్యాబొరేటరీ టెక్నిషియన్స్‌ ట్రేడులకు 15 నెలల నుంచి 2 సంవత్సరాలు ట్రైనింగ్ ఇస్తారు. ఇతర ట్రేడులకు 1 సంవత్సరం శిక్షణ ఉంటుంది.

Also Read :Vinegar for Home: ఇంట్లో ఎక్కడ చూసినా కూడా చీమలు ఉన్నాయా.. అయితే వెనిగర్ తో ఇలా చేయాల్సిందే?