Jobs In DCCBs  : ఏపీలోని డీసీసీబీ బ్యాంకుల్లో 251 జాబ్స్.. అప్లై చేసుకోండి

డీసీసీబీ బ్యాంకు వారీగా పోస్టుల విషయానికి వస్తే.. గుంటూరు డీసీసీబీలో(Jobs In DCCBs) 31 అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు, 50 స్టాఫ్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉన్నాయి.

Published By: HashtagU Telugu Desk
Jobs In Dccbs Guntur Krishna Srikakulam Kurnool Dccb Banks

Jobs In DCCBs  : ఆంధ్రప్రదేశ్‌ పరిధిలోని పలు డిస్ట్రిక్‌ కోఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంకుల్లో (DCCB) 251 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను  ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (APCOB) విడుదల చేసింది. ఇందులో భాగంగా గుంటూరు, కృష్ణా, శ్రీకాకుళం, కర్నూలు డీసీసీబీలలో 251 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు 50, స్టాఫ్‌ అసిస్టెంట్/ క్లర్క్‌ పోస్టులు 201 ఉన్నాయి.  ఆయా జిల్లాల వారీగా నోటిఫికేషన్ల వివరాలను ఆప్కాబ్‌ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.  జనవరి 22లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తును సమర్పించాలి. దరఖాస్తు ఫీజు జనరల్‌ అభ్యర్థులకు రూ.700. ఎస్సీ/ ఎస్టీ/ పీసీ/ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు రూ.500.

Also Read :Sankranti Cockfights : 3 రోజుల్లో రూ.1,500 కోట్ల కోడిపందేలు.. నష్టంతో ఎంతోమంది ఇంటిముఖం!

ఎక్కడెక్కడ ఎన్నెన్ని పోస్టులు ?

  • డీసీసీబీ బ్యాంకు వారీగా పోస్టుల విషయానికి వస్తే.. గుంటూరు డీసీసీబీలో(Jobs In DCCBs) 31 అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు, 50 స్టాఫ్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉన్నాయి. ఇక్కడ స్టాఫ్‌ అసిస్టెంట్‌ పోస్టుల్లో పీఏసీఎస్‌ ఇన్‌సర్వీస్‌ ఉద్యోగులకు 13 రిజర్వ్‌ అయ్యాయి.
  • శ్రీకాకుళం డీసీసీబీలో 19 అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు, 35 స్టాఫ్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉన్నాయి. వీటిలో 9 స్టాఫ్‌ అసిస్టెంట్‌ పోస్టులను పీఏసీఎస్‌ ఉద్యోగులకు కేటాయించారు.
  • కృష్ణా జిల్లా డీసీసీబీలో 66 స్టాఫ్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉన్నాయి. వీటిలో 17 పోస్టులను పీఏసీఎస్‌ ఇన్‌సర్వీస్‌ ఉద్యోగులకు కేటాయించారు.
  • కర్నూలు డీసీసీబీలో 50 స్టాఫ్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉన్నాయి. వీటిలో 13 పోస్టులను  పీఏసీఎస్‌ ఇన్‌సర్వీస్‌ ఉద్యోగులకు కేటాయించారు.

అర్హతలు, ఎంపిక ప్రక్రియ వివరాలు..

  • పోస్టును బట్టి విద్యార్హత ఉంటుంది.
  • 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి.
  • 55 శాతం మార్కులతో పీజీ పాసై ఉండాలి.
  • తెలుగు/ ఇంగ్లిష్‌ భాషల్లో (చదవటం/ రాయడం) ప్రావీణ్యం ఉండాలి.
  • కంప్యూటర్‌ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
  • 2024 సంవత్సరం అక్టోబరు 31 నాటికి 20 నుంచి 30 ఏళ్లలోపు వయసున్న వారు ఈ జాబ్స్‌కు అప్లై చేయొచ్చు.
  • ఫిబ్రవరిలో ఆన్‌లైన్‌ టెస్ట్‌  నిర్వహిస్తారు. తదుపరిగా ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది.
  • పోస్టును  బట్టి నెలకు రూ.26,080- రూ.57,860 వరకు (అలవెన్సులు కలుపుకుని) శాలరీ వస్తుంది.
  Last Updated: 16 Jan 2025, 09:53 AM IST