Site icon HashtagU Telugu

Andhra Pradesh: ఉద్యోగులకు 23 శాతం ఫిట్ మెంట్: సీఎం జగన్

Jagan Victory

Jagan AP employees

ప్రభుత్వ ఉద్యోగులకు 23 శాతం ఫిట్ మెంట్ ఇస్తున్నట్టు సీఎం జగన్ ప్రకటించారు. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అంతకుమించి ఇవ్వలేమని స్పష్టం చేశారు. ఫిట్ మెంట్ 14.29 శాతం కంటే ఎక్కువ ఇచ్చే పరిస్థితి లేదని కమిటీ చెప్పినా కూడా ప్రభుత్వం ధైర్యం చేసి ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. పెంచిన జీతాలు 2022 జనవరి 1 నుంచి వర్తిస్తాయని.. పెండింగ్ డీఏలు జనవరి జీతంతో కలిపి చెల్లిస్తామని హామీ ఇచ్చారు. 2020 ఏప్రిల్ నుంచి కొత్త పీఆర్సీ వర్తింపు చేస్తున్నట్టు సీఎం జగన్ వెల్లడించారు.

ఇక, కరోనాతో మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని, ఈ నియామకాలు జూన్ 30 లోపు పూర్తిచేస్తామని సీఎం జగన్ పేర్కొన్నారని సీఎస్ సమీర్ శర్మకు స్పష్టం చేశారు.

అటు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు జూన్ 30 లోపు ప్రొబేషన్, కన్ఫర్మేషన్ డిక్లేర్ చేస్తామని చెప్పారు.సొంత ఇల్లు లేని ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వమే జగనన్న టౌన్ షిప్పుల్లో 10 శాతం ప్లాట్లను రిజర్వ్ చేస్తున్నట్టు వెల్లడించారు. ఉద్యోగుల హెల్త్ కార్డు సమస్యను రెండు వారాల్లో పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.