Site icon HashtagU Telugu

Godavari : కొత్త అల్లుడికి ఏకంగా 225 రకాల వంటకాలతో మర్యాద చేసిన అత్తమామలు

Godvari Alludu

Godvari Alludu

సంక్రాంతి అంటే ఎవరికైనా టక్కున గర్తుకొచ్చేది గోదావరి జిల్లాలు. కోడి పందేలకు గోదావరి జిల్లాలు కేరాఫ్ అడ్రస్. ఇతర రాష్ట్రాల ప్రజలు సైతం కోడి పందాలు చూసేందుకు గోదావరి జిల్లాలకు వస్తుంటారు. కేవలం కోడిపందేలకే కాదు మర్యాదలకు సైతం గోదావరి జిల్లాలు పెట్టిందిపేరు. ముఖ్యంగా కొత్త అల్లుడికి రకరకాల పిండివంటలతో, వంటకాలతో అబ్బా అనిపిస్తారు. తాజాగా ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం రాజవరం గ్రామంలో ఇదే జరిగింది.

గ్రామానికి చెందిన కాకి నాగేశ్వరరావు, లక్ష్మి దంపతుల కుమార్తె జ్యోత్స్న ను పది నెలల క్రితం విజయవాడ కు చెందిన లోకేష్ సాయి అనే వ్యక్తి కి ఇచ్చి వివాహం చేసారు. లోకేష్ సాయి బెంగుళూరు లో బిజినెస్ చేస్తున్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా అత్త, మామల ఆహ్వానం మేరకు లోకేష్ సాయి తన భార్య ను తీసుకుని రాజవరం వచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

అత్తవారింటికి వచ్చిన అల్లుడికి కాకి నాగేశ్వరరావు దంపతులు ఘనమైన స్వాగతం పలికి అపురూపమైన రీతిలో మర్యాదలు చేసారు. భోగి పండగ రోజు భోజనం ను అల్లుడు జీవితంలో మర్చిపోలేని విధంగా 225 రకాల వంటకాలతో వడ్డించి వామ్మో అనిపించారు. అత్తమామల వంటకాలు చూసి షాక్ అయ్యాడు. తమ కుమారుడికి అత్త, మామలు వడ్డించిన విందు భోజనం చూసి లోకేష్ సాయి తల్లి దీప్తి మాట్లాడుతూ.. ఇది గోదావరి జిల్లాల ప్రేమ, సాంప్రదాయం, గౌరవ మర్యాదలకు నిదర్శనం అని తన సంతోషం వ్యక్తం చేసింది.

Read Also : Hanuman Collections : పుష్ప రికార్డ్స్ తో పోటీ పడుతున్న హనుమాన్