Cm Jagan: జ‌గ‌న్ లైజ‌నింగ్ తో విశాఖ‌కు `ఇన్ఫోసిస్`

ఐటీ కంపెనీల‌ను తీసుకురావ‌డానికి ఏపీ సీఎం జ‌గ‌న్ క‌స‌ర‌త్తు చేస్తున్నారు.

  • Written By:
  • Updated On - June 21, 2022 / 03:12 PM IST

ఐటీ కంపెనీల‌ను తీసుకురావ‌డానికి ఏపీ సీఎం జ‌గ‌న్ క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఆ క్ర‌మంలో విశాఖ‌కు ఇన్ఫోసిస్ కంపెనీని తీసుకొస్తూ మొద‌టి విజ‌యాన్ని జగ‌న్ సాధించారు. భారీ క్యాంప‌స్ ఏర్పాటుకు దేశీయ ఐటీ దిగ్గ‌జం ఇన్ఫోసిస్ సంసిద్ధ‌త వ్య‌క్తం చేసింది. విడ‌త‌ల వారీగా 3 వేల మందికి ఉపాధి క‌ల్పించేలా ఈ క్యాంప‌స్‌ను విశాఖ‌లో ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఇటీవ‌లే ఏపీ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి గుడివాడ అమ‌ర్నాధ్‌తో సంస్థ ప్ర‌తినిధులు భేటీ అయ్యారు. తొలి ద‌శ‌లో 1,000 సీటింగ్ కెపాసిటీతో ఈ క్యాంప‌స్‌ను ఆ సంస్థ ప్రారంభించ‌నుంది. విశాఖ‌లో ఏర్పాటు కానున్న ఇన్ఫోసిస్ క్యాంపస్ ఏకంగా ల‌క్ష చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో ఉంటుందని స‌మాచారం. అంతేకాకుండా తొలుత వెయ్యి సీటింగ్ కెపాసిటీతోనే ప్రారంభం కానున్న ఈ క్యాంప‌స్‌ను ఇన్ఫోసిస్‌ ద‌శ‌ల‌వారీగా 3 వేల సీటింగ్ కెపాసిటీకి పెంచ‌నుంద‌ని తెలుస్తోంది.