22 cows Died : ఆవుల అక్ర‌మ ర‌వాణా చేస్తున్న లారీ బోల్తా.. 22 ఆవులు మృతి

ఏపీలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. బొబ్బిలి మండలం గొర్లేసీతారాంపురం గ్రామం వద్ద ఆదివారం ఆవు..

  • Written By:
  • Publish Date - October 3, 2022 / 07:48 AM IST

ఏపీలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. బొబ్బిలి మండలం గొర్లేసీతారాంపురం గ్రామం వద్ద ఆదివారం ఆవుల‌తో వెళ్తున్న లారీ బోల్తాపడి 22 ఆవులు మృతి చెందాయి. దీంతో పశువులను అక్రమంగా తరలిస్తున్న దందాలు బట్టబయలయ్యాయి. లారీలో రాయగడ నుంచి తెలంగాణకు పెద్దఎత్తున ఆవులను అక్ర‌మ ర‌వాణా చేస్తున్న‌ట్లు స‌మాచారం. విజయనగరం జిల్లాకు వచ్చే సరికి రోడ్డుపై గుంతలు పడి తుపాను నీటితో నిండిపోయింది. లారీని గుంత‌లు దాటించే క్ర‌మంలో వాహనం బోల్తా పడింది. ఈ ఘ‌ట‌న‌లో 22 ఆవులు చనిపోగా, పలువురికి గాయాలయ్యాయి. లారీ బోల్తా ప‌డ‌టంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. పండుగకు ఇళ్లకు వెళ్తున్న వందలాది వాహనాలు నిలిచిపోయాయి. పశువుల అక్రమ రవాణా ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందుతున్న వ్యాపారం. ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లోని పోలీసులు పశువులను అక్ర‌మంగా త‌ర‌లిస్తుండ‌గా వారి ద‌గ్గ‌ర లంచాలు తీసుకుని చూసి చూడ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు.