ఏపీలో గంజాయి దందా.. పోలీసుల లెక్కలు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

ఏపీలో గంజాయి అక్రమ రవాణా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. ఈ ఏడాది 2,040 గంజాయి అక్రమ రవాణా కేసులు నమోదైయ్యాయి. గంజాయి స్మగ్లర్లు, చిరువ్యాపారులపై

  • Written By:
  • Publish Date - October 25, 2021 / 03:32 PM IST

ఏపీలో గంజాయి అక్రమ రవాణా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. ఈ ఏడాది 2,040 గంజాయి అక్రమ రవాణా కేసులు నమోదైయ్యాయి. గంజాయి స్మగ్లర్లు, చిరువ్యాపారులపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్(ఎన్డిపిఎస్) చట్టం కింద ఏపీ పోలీసులు ఈ కేసులు నమోదు చేశారు. జనవరి 1 నుంచి అక్టోబర్ 24 వరకు 5,415 మంది స్మగ్లర్లు, చిరువ్యాపారులను అరెస్టు చేసి 270 టన్నుల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గత ఏడాది 928 కేసులు నమోదవగా, ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య రెండింతలు ఎక్కువని పోలీసులు తెలిపారు.

గంజాయిని స్వాధీనం చేసుకోవడం, స్మగ్లర్లు మరియు పెడ్లర్ల అరెస్టులు పెరగడం వంటి వాటిని అరికట్టడానికి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (SEB) ఏర్పాటు చేసినట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. SEB, పోలీసులతో కలిసి రాష్ట్రంలో గంజాయి మరియు ఇతర డ్రగ్స్ స్మగ్లింగ్ అరికట్టేందుకు కృషి చేస్తున్నారు.స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో మొత్తం 2,040 కేసులకు గానూ 288 కేసులను నమోదు చేసింది. మిగిలిన 1,752 కేసులను స్థానిక పోలీసులు నమోదు చేశారు. రాష్ట్రంలోని మొత్తం 13 జిల్లాల్లో విశాఖపట్నంలో గంజాయి స్మగ్లర్లు, పెడ్లర్లపై 972 కేసులు నమోదై…మొదటి స్థానంలో నిలిచింది. తూర్పు గోదావరిలో 319 కేసులు, గుంటూరులో 138, చిత్తూరులో 107, కృష్ణాలో 98 కేసులు నమోదయ్యాయి.

ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎల్ఎస్డి, ఎండిఎంఎ, జోల్పిడెమ్ 50 ఎంజి, ట్రామాడోల్ వంటి ఇతర డ్రగ్స్ను సరఫరా చేస్తున్న వారిపై కూడా నాలుగు కేసులు నమోదు చేసింది. రాష్ట్రంలో పోలీసులు, ఎస్ఈబీ దాడుల్లో స్మగ్లర్లు గంజాయి రవాణాకు ఉపయోగించే 1,405 వాహనాలను సీజ్ చేశారు. గంజాయి స్మగ్లింగ, మాదకద్రవ్యాల పెడలింగ్లో పాల్గొన్న నిందితుల్లో ఎక్కువ మంది 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారితో పాటు….ఎక్కువగా కాలేజీల్లో డ్రాపౌట్లేనని SEB తెలిపింది.SEB తన సొంత ఇంటెలిజెన్స్ మూలాల ఆధారంగా గంజాయి స్మగ్లర్లపై 288 కేసులు నమోదు చేసింది.కోవిడ్-19 లాక్డౌన్ ఆంక్షలను సడలించిన తర్వాత గంజాయి స్మగ్లింగ్ కేసులు పెరిగాయని ఎస్ఈబీ కమిషనర్ వినిత్ బ్రిజ్లాల్ తెలిపారు. యువకుల ఆరోగ్యానికి హాని కలిగించే, కెరీర్ను పాడుచేసే గంజాయి, డ్రగ్స్ మరియు మరేదైనా మత్తుమందుల స్మగ్లింగ్ ను తాము సహించేంది లేదని డీజీపీ గౌతంమ్ సవాంగ్ తెలిపారు

రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ స్మగ్లింగ్ను ఉక్కుపాదంతో అరికట్టాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నందని డిఐజి టెక్నికల్ సర్వీసెస్ జి పాలరాజు తెలిపారు. గత సంవత్సరాలతో పోలిస్తే 2020 మరియు 2021 సంవత్సరాల్లో ఎక్కువ కేసులు నమోదైయ్యాయని అన్నారు. ప్రస్తుతం విశాఖపట్నం ఏజెన్సీ, పొరుగున ఉన్న ఒడిశాలోని ఏడు జిల్లాలలో గంజాయిని ఎక్కువగా సాగు చేస్తున్నారని…. స్మగ్లర్లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ద్వారా ఇతర రాష్ట్రాలకు గంజాయిని రవాణా చేస్తున్నారని డీఐజీ పాల్రాజ్ తెలిపారు . దుర్మార్గాలకు అలవాటు పడిన అనేక మంది యువకులు సులభంగా డబ్బు సంపాదించడానికి గంజాయి స్మగ్లింగ్కు పాల్పడుతున్నారని…. గంజాయి స్మగ్లింగ్లో పాల్గొన్న వారందరిని అరెస్ట్ చేసి… వారి బ్యాంకు ఖాతాల వివరాలను కూడా సేకరిస్తున్నామన్నారు.