రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ (AP Govt Good News) అందజేసింది. మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) అసెంబ్లీలో అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ (రైతు భరోసా) పథకాలపై చేసిన ప్రకటనలో, రైతులకు పెట్టుబడి సాయం అందించే విధానంపై స్పష్టత ఇచ్చారు. పీఎం కిసాన్ పథకం కింద కేంద్రం అందించే రూ.6 వేల సాయంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం మరింతగా రూ.20 వేల సాయం అందిస్తుందని తెలిపారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేస్తామని, ఈ స్కీమ్ కోసం బడ్జెట్లో రూ.4,500 కోట్లు కేటాయించినట్లు ఆయన పేర్కొన్నారు.
ఏపీ అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ43,402 కోట్లతో బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఎప్పుడూ లేని విధంగా నీటిపారుదల శాఖకు భారీ కేటాయింపులు చేశారు. ఏపీకి ఆర్ధిక వ్యవస్థకు వ్యవసాయ వెన్నెముక వంటిదని, రాష్ట్రంలో ఎక్కువ మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారని ప్రస్తావించారు. పంటల భీమా, డ్రోన్ల సరఫరా, వాటిపై శిక్షణ, వడ్డీ లేని రుణాలు, భుసార పరీక్షలు వంటి పలు పథకాలను అమలు చేయబోతున్నట్లు మంత్రి తన ప్రసంగంలో చెప్పుకొచ్చారు.
వ్యవసాయ బడ్జెట్ కేటాయింపులు చూస్తే..
* విత్తనాల పంపిణీకి రూ.240 కోట్లు
* భూసార పరీక్షలకు 38.88 కోట్లు
* ఎరువు సరఫరాకు రూ.40 కోట్లు
* పొలం పిలుస్తోంది కార్యక్రమానికి రూ.11.31కోట్లు
* ప్రకృతి వ్యవసాయం రూ-422.96 కోట్లు
* డిజిటల్ వ్యవసాయం-రూ.187.68 కోట్లు
* వడ్డీ లేని రుణాలకు-రూ.628 కోట్లు
* అన్నదాత సుఖీభవ-రూ.4500 కోట్లు
* రైతు సేవా కేంద్రాలకు -రూ.26.92 కోట్లు
* ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్-రూ44.03 కోట్లు
* పంటల భీమా-రూ.1,023 కోట్లు
* వ్యవసాయ శాఖ-రూ.8,564.37 కోట్లు
* ఉద్యాన శాఖ-రూ.8,564.37 కోట్లు
* పట్టు పరిశ్రమ-రూ.108.4429 కోట్లు
* వ్యవసాయ మార్కెటింగ్-రూ.314.80 కోట్లు
* సహకార శాఖ-రూ.308.26 కోట్లు
* ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం-రూ.507.038 కోట్లు
* ఉద్యాన విశ్వవిద్యాలయం-రూ.102.227 కోట్లు
* శ్రీ వెంకటేశ్వర పశు విశ్వవిద్యాలయం-రూ.171.72 కోట్లు
* మత్స్య విశ్వవిద్యాలయం-రూ.38 కోట్లు
* పశుసంవర్ధక శాఖ-రూ.1,095.71 కోట్లు
* ఉచిత వ్యవసాయ విద్యుత్- రూ.7241.30 కోట్లు
* ఉపాధి హామీ అనుసంధానం-రూ.5,150 కోట్లు
* ఎన్టీఆర్ జలసిరి-రూ.50 కోట్లు
* నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణ-రూ.14,637.03 కోట్లు
Read Also : Andhra Pradesh Beaches: ఏపీలో ఈ 5 బీచ్ లలో ఎంట్రీకి ఇంకా డబ్బులు కట్టాల్సిందే..