Gokulas : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పల్లె పండుగలో భాగంగా పిఠాపురంలో కుమారపురంలో కష్ణుడి ఆలయం వద్ద నిర్మించిన మినీ గోకులంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన 12,500 మినీ గోకులం షెడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోకులాల ద్వారా చిన్న, కౌలు రైతులు బాగుపడతారు. భవిష్యత్ లో 20వేల గోకులాలు ఏర్పాటు చేస్తామని వివరించారు. సంక్రాంతి పండుగ చాలా అద్భుతంగా జరుపుకుందాం అనుకున్నామని తెలిపారు.
15 సంవత్సరాలుగా బలమైన సూపర్ స్టార్ డమ్ వదులుకొని అన్నదమ్ముల కోసం వచ్చాను..ఒకటిన్నర దశాబ్దం తరువాత పోరాటం చేశాను. నా గాయాలకు మందు వేశారు పిఠాపురంప్రజలు. పిఠాపురం ప్రజల రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. తిరుమల ఘటనతో బాధ కలిగి భారీగా జరుపుకోలేకపోతున్నాం. వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుందాం. కుదిరితే వచ్చే దసరా బాగా జరుపుకుందాం. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం 268 గోకులాలు నిర్మిస్తే.. తాము కేవలం 6 నెలల్లోనే 12,500 గోకులాలు నిర్మించామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు.
ఎవరు తప్పు చేసిన బాధ్యత తీసుకోవాలి. తిరుపతిలో ప్రతీ వ్యక్తి బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తే.. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఉన్నతాధికారులు అంతా వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. ప్రతీ ఒక్కరూ బాధ్యత నిర్వర్తించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. ప్రతీ మూడు నెలలకొకసారి అభివృద్ధి గురించి చెప్పాలి. చంద్రబాబు నాయకత్వాన్ని నమ్మి ఓట్లు వేశారు. తప్పు ఎవరి వల్ల జరిగినా మేమందరం బాధ్యులం కాబట్టి.. క్షమాపణలు అడిగాం. పంచాయతీరాజ్ లో తప్పులు జరిగితే సమిష్టి బాధ్యత అన్నారు. ఎవరు తప్పు చేసిన బాధ్యత తీసుకోవలని ప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.