Sankranti – Special Trains : వచ్చే నెలలో సంక్రాంతి పండుగ ఉంది. ఈ గ్రాండ్ ఫెస్టివల్ కోసం దక్షిణ మధ్య రైల్వే 20 రైళ్లను నడపనుంది. ఇవి హైదరాబాద్-తిరుపతి, కాచిగూడ-కాకినాడ టౌన్ రూట్లలో నడుస్తాయి. సికింద్రాబాద్ నుంచి రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్రకు వెళ్లేవారి సౌకర్యార్ధం ఈ రైళ్లను ప్రవేశపెడుతున్నారు. డిసెంబర్ 28 నుంచి జనవరి 26 వరకు సంక్రాంతి స్పెషల్ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. మిగతా రైళ్లలాగే వీటిలోనూ ఫస్ట్ ఏసీ, సెకెండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ బోగీలు ఉంటాయి.
We’re now on WhatsApp. Click to Join.
హైదరాబాద్ – తిరుపతి మధ్య 07509, 07510 నంబర్లు కలిగిన రెండు రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ఇవి సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్ల మీదుగా నడుస్తాయి. ఇక కాచిగూడ – కాకినాడ టౌన్ మధ్య 07653 , 07654 నంబర్లు కలిగిన రెండు రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ఇవి మల్కాజిగిరి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట రైల్వేస్టేషన్ల మీదుగా(Sankranti – Special Trains) నడుస్తాయి.
Also Read: Israel – War Crime : ఇజ్రాయెల్ ఆర్మీ యుద్ధ నేరం.. కుటుంబాల ఎదుటే 11 మందిని చంపేశారు
- కాచిగూడ – కాకినాడ టౌన్ ట్రైన్ (నంబర్ 07653) గురువారం రాత్రి 8.30 గంటలకు బయలుదేరి, శుక్రవారం ఉదయం 8 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. ఈ రైలు డిసెంబర్ 28, జనవరి 4, 11, 18, 25 తేదీల్లో నడుస్తుంది.
- తిరుపతి – హైదరాబాద్ ట్రైన్ (నంబర్ 07510) శుక్రవారం రాత్రి 8.15 గంటలకు బయలుదేరి, శనివారం ఉదయం 8.40 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. ఈ రైలు డిసెంబర్ 29, జనవరి 5, 12, 19, 26 తేదీల్లో నడుస్తుంది.
- హైదరాబాద్ – తిరుపతి ట్రైన్ (నంబర్ 07509) గురువారం రాత్రి 7.25 గంటలకు బయలుదేరి, శుక్రవారం ఉదయం 8.20 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. ఈ రైలు డిసెంబర్ 29, జనవరి 4, 11, 18, 25 తేదీల్లో నడుస్తుంది.
- కాకినాడ టౌన్ – కాచిగూడ ట్రైన్ (నంబర్ 07654) శుక్రవారం సాయంత్రం 5.10 గంటలకు బయలుదేరి శనివారం తెల్లవారు జామున 4.50 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది. ఈ రైలు డిసెంబర్ 29, జనవరి 5, 12, 19, 26 తేదీల్లో నడుస్తుంది.