Site icon HashtagU Telugu

Ananthapuram : పోలీసుల తనిఖీల్లో బయటపడ్డ రూ.2 వేల కోట్లు

Containers Found By Police

Containers Found By Police

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల (Lok Sabha Elections) హోరు నడుస్తుంది. ఈ క్రమంలో ఎక్కడిక్కడే పోలీసులు (Police) తనిఖీలు చేపడుతూ పెద్ద ఎత్తున నగదు , మద్యాన్ని పట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఏపీలో పెద్ద ఎత్తున నగదు లభ్యం అవుతుంది. గడిచిన మూడురోజుల్లో ఏపీ, తెలంగాణలో కలిసి ఆరు కోట్ల రూపాయలను సీజ్ చేయగా..ఈరోజు అనంతపురం పామిడి వద్ద నాలుగు కంటైనర్లను పోలీసులు తనిఖీలు చేశారు. కంటైనర్లు ఓపెన్ చేయగానే అందులో బాక్సులు కనిపించాయి. వెంటనే వాటిని ఓపెన్ చేయాలనీ సిబ్బందికి చెప్పడం తో వారు ఓపెన్ చేయగా..ఒక్కసారిగా షాక్ తిన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

రూ.500 నోట్లతో కూడిన నోట్ల కట్టలు కనిపించాయి. ఆలా ఒక్కో కంటెనర్ లో ఒక్కో బాక్స్ ఉంది. మొత్తం నాల్గు బాక్స్ లలో కలిపి దాదాపు రూ. 2 వేల కోట్ల (2 Thousand crores) వరకు ఉంటుందని అభిప్రాయానికి వచ్చారు. అయితే ఆ కంటైనర్లను ఆర్బీఐకి చెందినవిగా అధికారులు చెబుతున్నారు. కొచ్చి నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రికార్డులను పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. కంటైనర్ల వ్యవహారంలో ప్లయింగ్ స్క్వాడ్, జిల్లా కలెక్టర్, ఐటీ అధికారులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. ఐటీ అధికారులు అనుమతించిన తర్వాత వాటిని హైదరాబాద్‌కు పంపిస్తామని పోలీసులు చెపుతున్నారు. నిజంగా అవి RBI వేనా..లేక రాజకీయ పార్టీలయా అనేది తెలియాల్సి ఉంది.

Read Also : LS Polls: పోలీసుల తనిఖీల్లో 37 లక్షల మద్యం పట్టివేత