Flights : రేపటి నుంచి విశాఖ టు విజయవాడకు మరో 2 విమాన సర్వీసులు

Flights : విమానం తిరిగి 8.45 గంటలకు బయలుదేరి రాత్రి 9.50 గంటలకు విజయవాడ వస్తుందని అధికారులు తెలిపారు. ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సర్వీస్‌ ఉదయం 9.35 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి 10.35 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది. తిరిగి రాత్రి 7.55 గంటలకు బయలుదేరి 9 గంటలకు విశాఖపట్నంకు వెళుతుంది.

Published By: HashtagU Telugu Desk
2 more flights from Visakhapatnam to Vijayawada

2 more flights from Visakhapatnam to Vijayawada

Visakha-Vijayawada : రేపటి నుండి విశాఖ-విజయవాడ మధ్య మరో రెండు విమాన సర్వీసులు ప్రారంభంకానున్నాయి. ఆదివారం నుంచి ఇండిగో, ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థలు ఈ సర్వీసులను నడపనున్నాయి. వీటిని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు ప్రారంభించనున్నారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇండిగో విమానం సాయంత్రం 7.15 గంటలకు బయలుదేరి రాత్రి 8.20 గంటలకు విశాఖకు చేరుకుంటుంది. అక్కడ విమానం తిరిగి 8.45 గంటలకు బయలుదేరి రాత్రి 9.50 గంటలకు విజయవాడ వస్తుందని అధికారులు తెలిపారు. ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సర్వీస్‌ ఉదయం 9.35 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి 10.35 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది. తిరిగి రాత్రి 7.55 గంటలకు బయలుదేరి 9 గంటలకు విశాఖపట్నంకు వెళుతుంది. ఈ సర్వీస్‌ల రాకతో విజయవాడ-విశాఖ విమాన సర్వీసుల సంఖ్య మూడుకు చేరనుంది.

కాగా, ప్రస్తుతం విశాఖపట్నం విమానాశ్రయం నుంచి విజయవాడకు నేరుగా ఒక విమానం మాత్రమే అందుబాటులో ఉంది, ఉదయం వచ్చి రాత్రి విజయవాడకు బయలుదేరుతుంది. అయితే ఈ సేవ అంతంతమాత్రంగానే అందుబాటులోకి రావడంతో ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో పాటు తరచూ ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఏపీ ఎయిర్‌ ప్యాసింజర్స్‌ అసోసియేషన్‌ చేసిన అభ్యర్థన మేరకు ఈ నెల 27 నుంచి అదనపు విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఇంకా, హైదరాబాద్, అహ్మదాబాద్‌లకు కొత్త విమాన సర్వీసులు అక్టోబర్ 29 నుండి ప్రారంభమవుతాయి, ప్రస్తుతం టిక్కెట్ విక్రయాలు జరుగుతున్నాయి.

Read Also: Union Bank Of India : తెలంగాణ, ఏపీలలో చెరో 200 బ్యాంక్ జాబ్స్

 

  Last Updated: 26 Oct 2024, 02:35 PM IST