Site icon HashtagU Telugu

Airports : ఏపీలో మరో 2 విమానాశ్రయాలు.. ?..పరిశీలనకు సన్నాహాలు

2 more airports in AP..?..preparations for inspection

2 more airports in AP..?..preparations for inspection

Airports : ఏపీలో రెండు గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్మాణానికి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. వాటిలో ఒకటి రాజధాని అమరావతిలో.. మరొకటి శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటుచేయాలని సంకల్పించింది. ఈ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోంది. అందులో భాగంగా శ్రీకాకుళంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు ప్రక్రియలో భాగంగా టెక్నో ఎకనమిక్ ఫీజబులిటీ రిపోర్ట్ తయారీ కోసం ఆంధ్రప్రదేశ్ ఎయిర్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (APADCL) కన్సల్టెన్సీలను ఆహ్వానిస్తోంది.

ఈ కన్సల్టెన్సీలు నివేదిక తయారు చేయటంతో పాటుగా, తాజా నిబంధనల ప్రకారం మాస్టర్ ప్లాన్ తయారు చేయాల్సి ఉంటుంది. అలాగే ఎన్విరాన్‌మెంటల్, సోషల్ ఇంపాక్ట్ పైనా అధ్యయనం చేయాల్సి ఉంటుంది.శ్రీకాకుళం జిల్లాలోని ఈశాన్య ప్రాంతంలో, శ్రీకాకుళం పట్టణానికి సుమారుగా 80 కిలోమీటర్ల దూరంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టును ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఈ ప్రాంతం అయితే అటు శ్రీకాకుళానికి ఇటు విశాఖపట్నానికి అనుకూలంగా ఉంటుందని అంచనా. అలాగే కోల్‌కతా- చెన్నై జాతీయ రహదారితో అనుసంధానమై ఉంటుంది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు ఏర్పాటు ప్రక్రియలో భాగంగా టెక్నో, ఎకనమిక్ ఫీజబులిటీ రిపోర్టు తయారీ కోసం కన్సల్టెన్సీలను ఆహ్వానిస్తున్నారు.

Read Also: Janasena : అఫిడవిట్‌లో ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించిన నాగబాబు

విమానాశ్రయాలకు ప్రాంతీయ అనుసంధానత, భవిష్యత్తులో ప్రయాణికులు అవరోధాలు లేకుండా సులభంగా ఎయిర్‌పోర్టులకు చేరుకునేందుకు అభివృద్ధి చేయాల్సిన రవాణా మార్గాలపైనా కన్సల్టెన్సీ సంస్థలు నివేదిక ఇవ్వాలని సూచించింది. విమానాశ్రయాలున్న ప్రాంతాలను ఏవియేషన్‌ హబ్‌లుగా తీర్చిదిద్దేందుకు.. వైమానిక, రక్షణరంగ తయారీ పరిశ్రమల అభివృద్ధికి ఉన్న అవకాశాలపై కూడా కన్సల్టెన్సీ సంస్థలు అధ్యయనం చేయాలని ఏపీఏడీసీ తెలిపింది. భవిష్యత్తులో డిమాండ్‌ ఎలా ఉండబోతోంది, ఎయిర్‌ ట్రాఫిక్‌ వృద్ధి ఎలా ఉంటుందన్న అంశాలనూ శోధించాలంది. ప్రభుత్వం నుంచి ఆర్థిక, ఇతరత్రా ఎలాంటి ప్రోత్సాహకాలు ఉండాలో కూడా సూచించాలని తెలిపింది.

విమానాశ్రయాలకు ఇతరత్రా మార్గాల్లో ఆదాయం (నాన్‌ ఏవియేషన్‌ రెవెన్యూ) వచ్చేందుకు అవసరమైన నిర్మాణాలు చేపట్టేందుకు ఎంత భూమి అవసరం? తదితర సమస్త సమాచారాన్నీ కన్సల్టెన్సీ సంస్థలు తమ నివేదికల్లో పొందుపరచాలని ఏపీఏడీసీ పేర్కొంది. విమానాశ్రయాలకు సంబంధించి రాబోయే 35 ఏళ్ల ట్రాఫిక్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కాన్సెప్ట్‌ మాస్టర్‌ప్లాన్‌ రూపొందించాలని, రన్‌వేలు, ట్యాక్సీవేలు ఎన్ని ఉండాలి.. అవి ఎంత పొడవు ఉండాలి, ఎయిర్‌క్రాఫ్ట్‌ పార్కింగ్‌ స్టాండ్‌లు ఎన్ని అవసరం, ఎలాంటి విమానాలు నిలిపేందుకు ఏ తరహా స్టాండ్లు ఉండాలి, ప్యాసింజర్, కార్గో టెర్మినళ్లు ఎలా ఉండాలి వంటి అంశాలన్నీ మాస్టర్‌ప్లాన్‌లో ఉండాలని తెలిపింది.

Read Also: Mobile phone : మీరు నిద్రలేవగానే మొబైల్ చూస్తున్నారా?..నష్టాలివే..!