Site icon HashtagU Telugu

185 stray pigs: ఏపీలో 185 పందులను కాల్చి చంపిన అధికారులు.. కారణమిదే..?

Cropped (5)

Cropped (5)

గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జివిఎంసి) పబ్లిక్ హెల్త్ అధికారులు ప్రొఫెషనల్ షూటర్ల సహాయంతో విశాఖపట్నం నగర పరిధిలో 185 పందులను శనివారం కాల్చి చంపారు. నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా పందులను చంపినట్లు అధికారులు పేర్కొన్నారు. జీవీఎంసీ కమిషనర్‌ పి.రాజబాబు మాట్లాడుతూ.. రోగాలు వ్యాపించి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్న పందులను స్పెషల్‌ డ్రైవ్‌లో చంపినట్లు తెలిపారు.

నగరంలో దాదాపు 5 వేల పందులు ఉన్నాయి. వాటిని నగరం నుంచి తీసుకెళ్లాలని యజమానులను కోరారు. శనివారం మెజారిటీ యజమానులు దాదాపు 1,000 పందులను స్వయంగా తరిమికొట్టారు. కానీ మిగిలిన వారు ఏమీ చేయలేదు. “కొందరు యజమానులు మొండిగా ఉండడంతో మేము 185 పందులను కాల్చి చంపడంలో ప్రొఫెషనల్ కిల్లర్స్ సహాయం తీసుకున్నాము” అని కమిషనర్ తెలిపారు. విశాఖపట్నంలో పందులను కాల్చిచంపడాన్ని స్థానికులు తీవ్రంగా ఖండించారు. జివిఎంసి పందుల కోసం షెల్టర్‌ను ఏర్పాటు చేయాలన్నారు.

నేడు రాష్ట్రపతి ఏపీలో పర్యటించనున్నారు. విశాఖలో జరుగనున్న నేవీ డే వేడుకలకు ఆమె తివిధ దళాల అధిపతిగా హాజరుకానున్నారు. నేడు ఉదయం 10.15 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో వైజాగ్ చేరుకుంటారు. కాగా ద్రౌపది ముర్ము రాష్ట్రపతి హోదాలో రాష్ట్రానికి రావడం ఇదే ప్రథమం. ఉదయం 11.25 -12.15 గంటల వరకు పోరంకి మురళీ కన్వెన్షన్ హాల్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పౌర సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అతిథి గృహానికి వెళ్తారు. 1 గంట నుంచి 2.15 గంటల వరకు గవర్నర్ ఏర్పాటు చేసిన అధికారిక విందులో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30కి ప్రత్యేక విమానంలో విశాఖపట్నం వెళ్తారు. అక్కడ రామకృష్ణ బీచ్ లో తూర్పు నౌకాదళం జరిపే నౌకాదళ దినోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు.

 

 

Exit mobile version