ఏపీ(AP)కి చెందిన 16 మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం స్థానచలనం (IPS Transfers) కలిగించింది. ఈ మేరకు బుధవారం బదిలీ ఉత్తర్వులు జారీ చేసింది.14 మందికి పోస్టింగ్ లు ఇవ్వగా.. ఇద్దర్ని మాత్రం డీజీపీ హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేశారు. వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న కొందరికి ఈసారి పోస్టింగ్ లు రావడం విశేషం. సీఐడీ ఐజీగా వినీత్ బ్రిజ్ లాల్ బదిలీ అయ్యారు. ఎం రవి ప్రకాశ్ పీ అండ్ ఎల్ ఐజీగా బదిలీ అయ్యారు. పీహెచ్‌డీ రామకృష్ణను ఇంటెలిజెన్స్ ఐజీగా బదిలీ చేశారు.
బదిలీల వివరాలు ఇలా ఉన్నాయి
సీఐడీ ఐజీ – వినీత్ బ్రిజ్ లాల్
పి అండ్ ఎల్ ఐజీ – రవిప్రకాష్
ఇంటెలిజెన్స్ ఐజీ – PHD రామకృష్ణ
ఇంటెలిజెన్స్ ఎస్పీ – ఫకీరప్ప
ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ ఎస్పీ – ఆరిఫ్ హఫీజ్
అడ్మినిస్ట్రేషన్ డీఐజీ – అమ్మిరెడ్డి
రోడ్ సేఫ్టీ డీఐజీ – CH విజయరావు
డీజీపీ ఆఫీస్ ఏఐజీ – సిద్ధార్ధ్ కౌశల్
విశాఖ సిటీ డీసీపీ – మేరీ ప్రశాంతి
అనకాపల్లి ఎస్పీ – తుహిన్ సిన్హా
కాకినాడ మూడో బెటాలియన్ కమాండెంట్ – M దీపిక
ఒంగోలు పోలీస్ ట్రైనింగ్ కాలేజీ (PTC) ప్రిన్సిపల్ – GR రాధిక
PTO ఎస్పీ – KSSV సుబ్బారెడ్డి
విజయవాడ క్రైమ్ డీసీపీ – తిరుమలేశ్వర్ రెడ్డి
ఇద్దరు అధికారుల్ని మాత్రం డీజీపీ హెడ్ క్వార్టర్స్ కి అటాచ్ చేశారు. అట్టాడ బాపూజీ, KV శ్రీనివాసరావుకి పోస్టింగ్ ఇవ్వకుండా డీజీపీ ఆఫీస్ కి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
Read Also : Alzheimer’s: అల్జీమర్స్ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందా..?