ఏపీ సీఎం జగన్ (Jagan) ఫై గులకరాయి తో దాడి చేసిన నిందితుడు సతీష్ (Sateesh) కు కోర్ట్ 14 రోజుల రిమాండ్ విధించింది. గత వారం ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ బస్సు యాత్ర ద్వారా ప్రచారం చేస్తుండగా..విజయవాడ లో యాత్ర చేస్తుండగా..ఒక్కసారిగా ఆయనపై రాయి తో దాడి జరిగింది. ఈ దాడి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ దాడి చేసింది ముమ్మాటికీ టీడీపీ నే అని వైసీపీ ఆరోపించగా..ఆ ఆరోపణలను టీడీపీ ఖండిస్తూ వచ్చింది. ఇక ఈ దాడి ఫై సిట్ అధికారులు విచారణ జరిపి పలువుర్ని అదుపులోకి తీసుకొని విచారించగా…వారిలో సతీష్ అనే మైనర్ బాలుడు ఈ దాడి చేసింది తానే అని ఒప్పుకున్నాడు. దీంతో అతడ్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశ పెట్టారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు నిందితుడు సతీశ్‌కు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇకసతీశ్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు పలు కీలక విషయాలు వెల్లడించారు. సీఎం జగన్ పై నిందితుడు రెండు సార్లు రాయి విసిరినట్లు తెలిపారు. ఒక సారి మిస్ కావడంతో మరోసారి తగిలినట్లు పేర్కొన్నారు. జగన్‌పై దాడి చేయమని నిందితుడు సతీశ్‌కు దుర్గారావు అనే వ్యక్తి చెప్పినట్లు చెప్పారు. దాడి తర్వాత దుర్గారావుకు నిందితుడు సతీశ్ ఫోన్ చేశారని, మరోసారి చేస్తే స్విచ్చాఫ్ వచ్చిందని రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపారు. ఇక దుర్గారావు టీడీపీ పార్టీకి చెందిన వ్యక్తి అని అంటున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also : Chiranjeevi: 100వ సారి రక్తదానం చేసిన నటుడు మహర్షి రాఘవ.. మెగాస్టార్ సన్మానం