ఏపీ ప్రభుత్వానికి (AP Govt) తలనొప్పి మొదలుకాబోతుంది. అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్..రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ..మరోపక్క రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చేలా వ్యూహాలు రచిస్తూ..ఇటు కేంద్రం నుండి పెద్ద ఎత్తున నిధులు సమకూరుస్తూ ముందుకు వెళ్తుంది. ఇప్పటికే రోడ్లు బాగుచేయడం..నెల ఒకటోతారీఖునా పెన్షన్లు అందజేయడం..తదితరుల పనులు చేస్తూ వస్తుంది. ఈ క్రమంలో 108 ఉద్యోగుల సంఘం ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేసింది. తమ డిమాండ్ల సాధనే లక్ష్యంగా ఈ నెల 25 నుంచి సమ్మె చేయనున్నట్లు 108 ఉద్యోగుల సంఘం (108 Employees Workers Ready ) వెల్లడించింది. 108 సర్వీసుల నిర్వహణ సంస్థ మారినప్పుడల్లా ఉద్యోగులు గ్రాట్యుటీ, ఎర్న్డ్ లీవ్ ఎమౌంట్, ఇయర్లీ ఇంక్రిమెంట్ల విషయంలో నష్టపోతున్నారని తెలిపింది. వీటిని చెల్లించకుండానే సంస్థలు తప్పుకుంటున్నాయని పేర్కొంది. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేసింది.
108 నిర్వహణను ప్రభుత్వమే చూసుకోవాలని రాష్ట్ర 108 సర్వీస్ ఒప్పంద ఉద్యోగుల సంఘం నేతలు కోరారు. 108 అనేది కార్పొరేట్ సంస్థలకు ఆదాయ వనరుగా మారిందని వారంతా అవేదన వ్యక్తం చేశారు. 108 నిర్వహణ బాధ్యతలు కార్పొరేట్ సంస్థలకు అప్పగించవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. అక్టోబర్ 18వ తేదీన 12 డిమాండ్లతో వైద్య, ఆరోగ్య శాఖకు నోటీసులు ఇచ్చామమన్నారు. అయినప్పటికీ వారి నుండి ఎలాంటి స్పందన రాలేదని..వెంటనే తమ డిమాండ్స్ ను నెరవేర్చాలని కోరుతూ..ఈ నెల 25 నుంచి సమ్మె చేయనున్నట్లు 108 ఉద్యోగుల సంఘం వెల్లడించింది. మరి దీనిపై ప్రభుత్వం స్పందిస్తుందో చూడాలి.
Read Also : Gopi Mohan : డైరెక్టర్ గా మారుతున్న స్టార్ రైటర్.. మహేష్ మేనల్లుడు హీరోగా సినిమా..