Site icon HashtagU Telugu

100 Variety Foods: క్రేజీ అత్త , అల్లుడి కోసం 100 రకాల వంటకాలు

100 Variety Foods

100 Variety Foods

100 Variety Foods: ఏపీలో అల్లుడుని ఎంత బాగా చేసుకుంటారో మనందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా కొత్త అల్లుడిని అయితే నెత్తిన పెట్టుకుంటారు. మరికొందరు అయితే కూతురి మీద ప్రేమతో అల్లుడిని ఇంట్లో దేవుడిలా భావిస్తారు. ఇక అల్లుడు అత్తారింటికి వస్తున్నాడంటే ఆ హడావుడి మాములుగా ఉండదు. దేశంలోని అనేక ప్రాంతాల్లో శతాబ్దాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. అల్లుడుకి స్వాగతం పలికేందుకు అత్తమామలు తినడానికి ఎన్నో రకాల వంటకాలు సిద్ధం చేస్తారు. ఈ సంప్రదాయం క్రమంగా అంతరించిపోతోంది. అయితే తాజాగా క్రేజీ అత్తా చేసిన పనికి అల్లుడు షాక్ అయ్యాడు. కాకినాడ అత్తా మజాకా అంటున్నారు.

ఆషాడం ముగిసిన తర్వాత మొదటిసారి ఇంటికి వస్తున్న అల్లుడికి ఓ అత్త వంటకాలతో ఆశ్చర్యపరిచింది. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా కిరాలం మండలం తామరాడ గ్రామంలో ఓ అత్త తన అల్లుడు రవితేజకు 100 రకాల వంటకాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఇందులో ఆంధ్ర సంప్రదాయ వంటకాల నుంచి రకరకాల ఆధునిక వంటకాల వరకు అన్నీ ఉన్నాయి. అత్త తన అల్లుడిని స్వాగతించడానికి ఇలా వంటకాలు ప్రిపేర్ చేశారు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే వంటలన్నీ ఇంట్లోనే తయారయ్యాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలోని ఓ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. ఇక్కడ కూతురు, అల్లుడికి స్వాగతం పలికేందుకు కుటుంబసభ్యులు 100 రకాల వంటకాలు వడ్డించారు. అది చూసి అల్లుడు చలించిపోయాడు.ఆహారంలో అన్నం, కూరలు, రోటీలు-చట్నీలు, స్వీట్లు మరియు పానీయాలు ఉన్నాయి.

Also Read: Rajasthan: రీల్స్‌ పిచ్చి, చెరువులో మునిగి 7 మంది చిన్నారులు మృతి