Anna-Canteens : ఆగస్టు 15న 100 అన్న క్యాంటీన్లు ప్రారంభం : సీఎం చంద్రబాబు

తొలి విడతలో 100 అన్న క్యాంటీన్ల ప్రారంభించనుంది ఏపీ ప్రభుత్వం..

Published By: HashtagU Telugu Desk
100 anna canteen to start on August 15.. CM Chandrababu

100 anna canteen to start on August 15.. CM Chandrababu

Anna-Canteens: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే శుభవార్త అందించారు. ఆగస్టు 15వ తేదీన కృష్ణా జిల్లా ఉయ్యూరులో సాయంత్రం ఆరున్నర గంటలకు  అన్న క్యాంటీన్ను ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఆగస్టు 16వ తేదీన మిగిలిన 99 క్యాంటీన్లను మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించనున్నారు.   ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, ఏపీలోని కూటమి ప్రభుత్వం అన్ని క్యాంటీన్లకు ఎన్టీఆర్ పేరు మీదుగా అన్న క్యాంటీన్లు పేరు పెడతారా లేక డొక్కా సీతమ్మ పేరు పెడతారా అన్నది కొంత సస్పెన్స్‌గా మారింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. డొక్కా సీతమ్మ పేరును ప్రభుత్వ పథకాల్లో ఒకదానికి పెట్టాలని ప్రతిపాదించారు. అన్న క్యాంటీన్లకే ఈ పేరు పెడతారని ప్రచారం జరిగింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓ సమావేశంలోనూ దీనిపై ఆసక్తికర చర్చ జరిగింది. స్వయంగా ఉప ముఖ్యమంత్రి ప్రతిపాదించడంతో.. అన్న క్యాంటీన్లతో పాటు.. డొక్కా సీతమ్మ క్యాంటీన్లను ప్రారంభిస్తారనే టాక్ నడిచింది.

కానీ.. చివరకు అన్న క్యాంటీన్లు అదే పేరుతో కొనసాగుతాయని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. 2019 వరకు ఉన్న విధంగానే అన్న క్యాంటీన్లనే కొనసాగించాలని సూచించారు డిప్యూటీ సీఎం పవన్. డొక్కా సీతమ్మ పేరును.. ఏపీలో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనానికి ఖరారు చేసింది ప్రభుత్వం. ఆంధ్రా అన్నపూర్ణగా పిలిచే.. డొక్కా సీతమ్మ పేరును మధ్యాహ్న భోజన పథకానికి పెట్టడం సరైనదేనని పవన్ పేర్కొన్నారు.

Read Also: New Zealand 15 Squad: 5 స్పిన్నర్లను దించుతున్న న్యూజిలాండ్

  Last Updated: 12 Aug 2024, 02:33 PM IST