Pawan Kalyan: ఇడుపులపాయలో మీ ఇళ్ల మీదుగా హైవే వేస్తాం: పవన్ వార్నింగ్

ఇప్పటంలో బాధితులను పరామర్శించకుండా పోలీసులు అడ్డుకోవడంపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Written By:
  • Updated On - November 5, 2022 / 12:32 PM IST

ఇప్పటంలో బాధితులను పరామర్శించకుండా పోలీసులు అడ్డుకోవడంపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వైసీపీ గూండాల అరాచకాలు ఇలాగే సాగితే ఇడుపులపాయలో మీ ఇళ్ల మీదనుంచి హైవే వేస్తాం’ అని హెచ్చరించారు. పెదకాకానిలో ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇంటిముందు 15 అడుగుల రోడ్డే ఉందని, అక్కడెందుకు విస్తరణ చేయరని ప్రశ్నించారు. గుంతలు పూడ్చలేని ప్రభుత్వం రోడ్లు విస్తరిస్తామని చెప్పడానికి సిగ్గుండాలని ఫైరయ్యారు.

ఇప్పటం గ్రామంలో ఇళ్ళకూల్చివేత బాధితుల పరామర్శకోసం జనసేన కార్యాలయం నుంచి బయలుదేరిన పవన్ కళ్యాణ్ ను అనుమతులు లేవని అడ్డుకొన్న పోలీసులు… కారు దిగి కాలి నడకన ఇప్పటం బయలుదేరారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.