Amitabh Bachchan: గాయాల నుంచి కోలుకుంటున్నా.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన అమితాబ్..!

బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) తన ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూనే ఉన్నారు. ఇటీవల అమితాబ్ బచ్చన్ తన రాబోయే చిత్రం ప్రాజెక్ట్-కె షూటింగ్‌లో హైదరాబాద్‌లో గాయపడ్డారు.

  • Written By:
  • Updated On - March 21, 2023 / 01:03 PM IST

బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) తన ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూనే ఉన్నారు. ఇటీవల అమితాబ్ బచ్చన్ తన రాబోయే చిత్రం ప్రాజెక్ట్-కె షూటింగ్‌లో హైదరాబాద్‌లో గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆయన తన బ్లాగ్ ద్వారా అభిమానులకు తెలియజేశారు. తన పక్కటెముకలు, కండరాలకు తీవ్రమైన గాయాలు ఉన్నాయని అతను చెప్పాడు. ఇప్పుడు బిగ్ బి మరోసారి తన హెల్త్ అప్‌డేట్ షేర్ చేశారు.

సినిమా చిత్రీకరణలో ఇటీవల గాయపడిన బాలీవుడ్‌ ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ కోలుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పారు. త్వరలోనే యథావిధిగా పని ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఓ ఫొటోను షేర్‌ చేశారు. అందులో ఆయన బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ దుస్తుల్లో స్టైలిష్‌గా కనిపించారు. ‘మీ ప్రార్థనలతో ప్రస్తుతం నేను కోలుకుంటున్నా. ఆరోగ్యం బాగవుతున్నది. త్వరలోనే షూటింగ్‌లకు సిద్ధమవుతా. నా ఆరోగ్యం బాగుపడాలని కోరుకున్న ప్రతి అభిమానికి కృతజ్ఞతలు.’ అని అమితాబ్‌ తెలిపారు. బిగ్‌ బీ ప్రస్తుతం ‘ఘణపత్‌’, ‘గూమర్‌’, ‘ది ఉమేష్‌ క్రానికల్స్‌’, ‘బటర్‌ ఫ్లై’, ‘ఖాకీ 2’ వంటి చిత్రాల్లో నటిస్తున్నారు.

Also Read: Keerthy Suresh Gifts: కీర్తి యూ ఆర్ గ్రేట్.. దసరా చిత్ర యూనిట్ కు గోల్డ్ కాయిన్స్!

మార్చి తొలివారంలో హైదరాబాద్‌లో జరిగిన ‘ప్రాజెక్ట్‌ కె’ (వర్కింగ్‌ టైటిల్‌) సినిమా చిత్రీకరణలో అమితాబ్‌ గాయాల పాలైన సంగతి తెలిసిందే. యాక్షన్‌ సీన్స్‌ షూట్‌ చేస్తుండగా ఆయన కుడివైపు పక్కటెముకలకు దెబ్బ తగిలింది. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో తగిన చికిత్స తీసుకున్న అనంతరం.. ముంబైలోని తన నివాసానికి చేరుకున్నారు. తాను క్షేమంగానే ఉన్నానని పేర్కొన్నారు. ప్రభాస్‌ హీరోగా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్‌ చిత్రమే ‘ప్రాజెక్ట్‌ కె’. దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌, దిశా పటాని, తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.